వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంటా ఎప్పుడొస్తారో, ఎప్పుడు పోతారో, ఆ ఇద్దరే టాప్: మంత్రులపై బాబు జోకులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Chandrabau naidu On cabinet ministers : నారా లోకేశ్‌ ముందంజలో, చంద్రబాబు వ్యంగ్యం

అమరావతి: ఎప్పుడూ సీరియస్‌గా ఉండే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన సహచర మంత్రులపై జోకులు పేల్చారు.వీడియో కాన్పరెన్స‌లో చంద్రబాబునాయుడు మంత్రులకు నవ్వుతూనే చురకలంటించారు. తన వద్దే ఫైళ్ళు పేరుకుపోవడంపై అధికారులపై ఒకింత ఆగ్రహన్ని వ్యక్తం చేశారు.

ఆ చరిత్ర వికిపీడియాలో, అర్హత ఉంటేనే నామినేటేడ్ పోస్టులు: బాబుఆ చరిత్ర వికిపీడియాలో, అర్హత ఉంటేనే నామినేటేడ్ పోస్టులు: బాబు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిత్యం పార్టీ కార్యక్రమాలతో పాటు, అధికారిక కార్యక్రమాల్లో బిజీగా గడుపుతుంటారు. అయితే అంతేకాదు పార్టీ సమావేశాల్లో కానీ, అధికారులతో సమీక్ష సమావేశాల్లో కానీ, చంద్రబాబునాయుడు నవ్వుతూ మాట్లాడడం చాలా అరుదుగా కన్పిస్తోంది.

రవిబాబు ఎఫెక్ట్: అనుచరులతో గిడ్డి ఈశ్వరీ సమావేశం, జగన్‌కు షాకిచ్చేనా?రవిబాబు ఎఫెక్ట్: అనుచరులతో గిడ్డి ఈశ్వరీ సమావేశం, జగన్‌కు షాకిచ్చేనా?

అయితే ఇటీవల కాలంలో చంద్రబాబునాయుడు తన పంథాను మార్చుకొన్నారు. విదేశీ పర్యటనను పూర్తి చేసుకొని వచ్చిన చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో జోకులు వేసి నవ్వించారు. అదే తరహలో మరోసారి వ్యవహరించారు.

 మంత్రులపై జోకులు వేసిన చంద్రబాబు

మంత్రులపై జోకులు వేసిన చంద్రబాబు

ఎప్పుడూ సీరియస్‌గా ఉండే ముఖ్యమంత్రి ఇటీవల జోకులు పేలుస్తున్నారు. ముఖం నిండా నవ్వు పులుముకొని మంత్రులపై సెటైర్లు వేస్తున్నారు.తాను చెప్పాలనుకొన్న అంశాలను నవ్వుతూనే చెబుతూ మంత్రులు, అధికారులకు చంద్రబాబునాయుడు చురకలు అంటిస్తున్నారు.ఫైళ్ళ క్లియరెన్స్‌తో పాటు ఇతర అంశాలపై చంద్రబాబునాయుడు తన అభిప్రాయాలను అధికారులకు, మంత్రులకు తెలిసేలా చెబుతున్నారు. సీరియస్‌గా చెప్పడం కన్నా నవ్వుతూనే తాను చెప్పాలనుకొన్న విషయాన్ని వారికి చేరవేస్తున్నారు.

లోకేష్, చినరాజప్ప టాప్

లోకేష్, చినరాజప్ప టాప్


గత వారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైళ్ళ క్లియరెన్స్‌ గురించి సమీక్షించారు. ఫైళ్ళ క్లియరెన్స్‌లో హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి నారా లోకేశ్‌ ముందంజలో ఉన్నారు. వీరి వద్దకు వచ్చిన ఫైళ్ళు వచ్చినట్టు పంపుతున్నట్టున్నారు. అందుకే ముందంజలో ఉన్నారంటూ జోకు వేశారు. తాము ఫైళ్ళను పరిశీలించి పరిష్కరించి పంపుతున్నామని ఎక్కడా జాప్యం చేయడంలేదన్నారు ఆ మంత్రులు

గంటా ఎప్పుడోస్తారో,ఎప్పుడు వెళ్తారో

గంటా ఎప్పుడోస్తారో,ఎప్పుడు వెళ్తారో


ఫైళ్ళ క్లియరెన్సులో మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పేషీ పూర్తిగా వెనుకబడింది. దీనిపై సీఎం వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఫైళ్ళు క్లియరెన్స్ కావడం లేదని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.ఫైళ్ళ క్లియరెన్స్‌ను వెంట వెంటనే పూర్తి చేయాలని చంద్రబాబునాయుడు మంత్రులను ఆదేశించారు. ఫైళ్ళ క్లియరెన్స్ చేయకపోతే ఇబ్బందులు ఎదురౌతాయని చెప్పారు.

నా పేషీలో కూడ ఫైళ్ళ క్లియరెన్స్‌లో ఆలస్యం

నా పేషీలో కూడ ఫైళ్ళ క్లియరెన్స్‌లో ఆలస్యం

నాపేషీలో కూడా ఒక్కో ఫైలు రెండు మూడు రోజులపాటు ఉండటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసంతృప్తి వ్యక్తంచేశారు. నా పేషీలోనే ఇలా ఉంటే.. నేను మిగతావారిని ఎలా అడుగుతాను అని పేషీ అధికారులకు చురకలు అంటించారు. కొంతమంది మంత్రుల వద్ద ఒక్కో ఫైలు అయిదు నుంచి ఏడురోజులు ఉండటం పట్ల చంద్రబాబు అసహనం వ్యక్తంచేశారు.

ఇక్బాల్ అహ్మద్‌కు బాబు హమీ: నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డికి ఇంఛార్జీ బాధ్యతలు?ఇక్బాల్ అహ్మద్‌కు బాబు హమీ: నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డికి ఇంఛార్జీ బాధ్యతలు?

English summary
Funny conversation between Andhra pradesh chief minister Chandrabau naidu his cabinet ministers. He conducted video conference on files clearance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X