గంటాశ్రీనివాసరావు పై పత్తిపాటిపుల్లారావుకు పగ: పయ్యావుల కేశవ్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య బుదవారం నాడు ఆసక్తికర సంభాషణ చోటుచేసుకొంది.వైఎస్ కుటుంబంపై వారు చర్చించుకొన్నారు.వైఎస్ విజయమ్మ, వైఎస్ వివేకానంద రెడ్డిలను ఓడించారని మంత్రి గంటా శ్రీనివాసరావు లక్ష్యంగా ఈ సంబాషణలు చోటుచేసుకొన్నాయి.

బుదవారం నాడు అసెంబ్లీ లాబీల్లో టిడిపి ఎమ్మెల్యేల మధ్య సరదాగా మాట్లాడుకొన్నారు.వైఎస్ కుటుంబంపై మంత్రి గంటా శ్రీనివాస్ రావు పగబట్టారని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సరదాగా వ్యాఖ్యానించారు.

అంతేకాదు గంటా శ్రీనివాస్ రావు ఎక్కువ కాలం మంత్రిగా ఉండడం ఇష్టంలేని మంత్రి పత్తిపాటి పుల్లారావు గంటా పై పగబట్టారని పయ్యావుల కేశవ్ జోక్ చేశారు.

funny conversation between ministers pattipati pulla rao and ganta srinivasarao

ఈ వ్యాఖ్యలను మంత్రి గంటా శ్రీనివాస్ రావు సరదాగా తీసుకొన్నారు. ఎవరు ఎవరిపై పగబట్టారనేది పయ్యావుల కేశవ్ తేలుస్తారని గంటా వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్నవారంతా నవ్వుకొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడపలో టిడిపి విజయం సాధించిన సందర్భంలో గంటా శ్రీనివాస్ రావును జగన్ పై పోటీకి నిలుపుదామని మంత్రి పత్తిపాటి పుల్లారావు బాబు వద్ద ప్రస్తావించారు.అయితే ఈ నేపథ్యంలో ఈ సంబాషణ సాగింది.కడపలో వైఎస్ విజయమ్మను ఓడించాం, కడపలో వైఎస్ వివేకానందను ఓడించామని గంటా బాబు వద్ద ప్రస్తావించగానే పత్తిపాటి ఈ రకంగా వ్యాఖ్యానించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Funny conversation between ministers pattipati pulla rao and ganta srinivasarao in assembly lobby on wednesday.
Please Wait while comments are loading...