సికింద్రాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌ను తలదన్నేలా..!!

Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాదిమందికి చిరపరిచితం. మొత్తం 10 ప్లాట్‌ఫామ్స్, 11 ట్రాక్స్ ఉన్న స్టేషన్ నుంచి నిత్యం 241 రైళ్లు దేశం నలుమూలలకూ రాకపోకలు సాగిస్తోంటాయి. దేశంలో అత్యధిక ఆదయాన్ని ఆర్జించే జోన్లల్లో ఒకటిగా ఉండే దక్షిణ మధ్య రైల్వేకు కేంద్ర బిందువు.

ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలకు విస్తరించిన ఈ అతిపెద్ద జోన్ ప్రధాన కార్యాలయం రైల్ నిలయం ఉండేది సికింద్రాబాద్‌లోనే. వందే భారత్, రాజధాని, శతాబ్ది సహా అన్ని రకాల ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తోన్నాయి. ఇప్పటివరకు కనెక్టివిటీ లేని నగరాలకూ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.

Secunderabad RS

పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు, రైళ్లు, ప్లాట్ ‌ఫామ్‌ల సంఖ్యకు అనుగుణంగా దీన్ని మరింత విస్తరింపజేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆధునికీకరిస్తోంది. అంతర్జాతీయ విమానాశ్రయంలో తరహాలో దీన్ని తీర్చిదిద్దుతోంది. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా కొసాగుతున్నాయి.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ పునర్నిర్మాణానికి 712 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పనులను చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. మూడు దశల్లో పూర్తి కానున్నాయి. వచ్చేే 40 సంవత్సరాల వరకు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎయిర్ పోర్ట్ తరహాలో ఈ స్టేషన్ పునర్నిర్మితం కానుంది. ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తవుతాయనే అంచనాలు ఉన్నాయి.

తెలంగాణలో- సికింద్రాబాద్ సహా మలక్‌పేట్, మహబూబ్ నగర్, కామారెడ్డి, నిజామాబాద్, మల్కాజ్‌గిరి, ముద్ఖేడ్, ఆదిలాబాద్, రామగుండం, కరీంనగర్, మహబూబాబాద్, హైటెక్ సిటీ, హఫీజ్‌పేట్, జహీరాబాద్, తాండూరు, భద్రాచలం రోడ్, హుప్పుగూడ, యాదాద్రి, ఖాజీపేట్ జంక్షన్, మధిర.. వంటి రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్రం ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే.

రైల్వే స్టేషన్ పనుల పురోగతికి సంబంధించిన వివరాలను కేంద్ర గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి వెల్లడించారు. కొన్ని ఫొటోలను తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దక్షిణం వైపు ఉన్న బేస్‌మెంట్, అప్రోచ్ రోడ్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఫినిషింగ్ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

నార్త్, సౌత్ భవనాలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, సౌత్ ఈఎస్ఎస్, అండర్ గ్రౌండ్ పనులు వేగం పుంజుకొన్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. మొత్తంగా 35 శాతం మేర సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు పూర్తయినట్లు చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+