విభజనపై కలత: ఏడ్చేసిన ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి
గుంటూరు: రాష్ట్ర విభజనపై గుంటూరు జిల్లాకు చెందిన కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కనిపించారు. మీడియా ప్రతినిధుల ముందు ఆయన కంటి తడి పెట్టుకున్నారు. తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఇటువంటి పరిస్థితి వస్తుందని తాను ఏ రోజూ అనుకోలేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
శాసనసభ విభజనను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినా అదే బిల్లును పార్లమెంటులో పెట్టుకుని ఆమోదింపజేసుకోవాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ఇది అప్రజాస్వామిక నిర్ణయమని ఆయన అన్నారు. ఈ విధమైన నిర్ణయాలు అమలు చేసేవారు ఎంతటివారైనా కష్టాలు కొని తెచ్చుకుంటారని ఆయన అన్నారు.

రాజ్యాంగాన్ని సవరిస్తే గానీ శాసనసభ వ్యతిరేకించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు వీలు లేదని ఆయన అన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఉంచడాన్ని రాజ్యాంగం అంగీకరించదని ఆయన అన్నారు. తెలంగాణ కావాలని కోరుతున్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉందని చెప్పారు.
రాష్ట్ర విభజన వ్యవహారంపై నివేదికలన్నీ రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే సూచించాయని ఆయన అన్నారు. వాటిని తుంగలో తొక్కిన కాంగ్రెసు పార్టీ విభజన వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడం భావ్యం కాదని ఆయన అన్నారు.
-
తిరుమల తరహాలో గుంటూరు, విశాఖలలో... మంత్రి గుడ్ న్యూస్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications