పోలవరం ప్రాజెక్ట్ పనులను కలసి పరిశీలించనున్న గడ్కరీ, చంద్రబాబు
Recommended Video

విజయవాడ:జూలై 11 బుధవారం నాడు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పనులను కేంద్రమంత్రి గడ్కరీ, సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారని మంత్రి దేవినేని ఉమ తెలిపారు.
ఒక టివి ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి దేవినేని ఉమా ఈ విషయం వెల్లడించారు. సవరించిన పోలవరం అంచనాలను కేంద్రానికి పంపామని తెలిపారు. రూ.57 వేల కోట్లతో ఈ ప్రాజెక్ట్ అంచనాలు సవరించినట్లు వెల్లడించారు. 2013 చట్టం ప్రకారం భూసేకరణ, పునరావాసం అంచనాలు పెరిగాయని...అవి 3 వేల కోట్ల నుంచి 33 వేల కోట్లకు పెరిగినట్లు మంత్రి ఉమా తెలియజేశారు.

పోలవరం ప్రాజెక్ట్ కోసం తక్షణమే 10 వేల కోట్లను విడుదల చేయాలని తాము గడ్కరీని కోరుతామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తయిన పనుల నిమిత్తం కేంద్రం నుంచి రూ.2300 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని మంత్రి తెలిపారు. వాటికి సంబంధించి పోలవరం అథారిటీకి బిల్లులు సమర్పించామన్నారు. డయా ఫ్రం వాల్ పూర్తి చేశామని, గోదావరి వరదతో పనులు ఆగలేదని మంత్రి ఉమా వెల్లడించారు.












Click it and Unblock the Notifications