వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరంపై మరో చిక్కుముడి: గడ్కరీకి బాబు ఫోన్, కాంగ్రెస్ నిరసన

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టును తప్పకుండా 2019 నాటికి పూర్తి చేయడానికి తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు తావు లేదని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ.. ఏపీ సీఎం చంద్రబాబకు హామీ ఇచ్చారు.

ప్రాజెక్టుకు రూ.381 కోట్లు విడుదల చేయడానికి తాజాగా ఉత్తర్వులు ఇచ్చినట్లు గడ్కరీ సీఎంకు చెప్పారు. కొరియా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం పోలవరం వివాదంపై ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రాజెక్టుపై ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు.

గడ్కరీకి చంద్రబాబు ఫోన్

గడ్కరీకి చంద్రబాబు ఫోన్

రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో గడ్కరీ ఈరోజు సమావేశం ఏర్పాటు చేసినందున దక్షిణ కొరియా బూసాన్‌ నుంచి ఫోన్‌ చేసిన ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యతను స్పష్టం చేశారు. ఇదే విషయంపై గడ్కరీతో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి తన కొరియా పర్యటనకు ముందే ప్రయత్నించగా. ఆయన లండన్‌ పర్యటనలో ఉన్నందున సాధ్యపడలేదు. పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఖర్చు చేసిన రూ.2,800 కోట్లు రాష్ట్రానికి ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు .. గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.

పూర్తి సహకారం

పూర్తి సహకారం

పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని.., సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు గడ్కరీ. అంతేగాక, మంగళవారం కొందరు కాంగ్రెస్‌ నేతలు పోలవరం విషయంలో తనను కలిస్తే వారితో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. 2019నాటికి పోలవరం పూర్తి చేసే బాధ్యత తమదేనని అన్నారు.

గడ్కరీతో కాంగ్రెస్ నేతల భేటీ

గడ్కరీతో కాంగ్రెస్ నేతల భేటీ

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రమంత్రి గడ్కీరీని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ నేతలు రఘువీరారెడ్డి, కేవీవీ రామచంద్రరావు, సుబ్బరామిరెడ్డి, జేడీ శీలం తదితరులు కలిశారు. పోలవరం నిర్మాణ పనులను కేంద్రమే చేపట్టాలని, 2018 నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

నాటకాలంటూ కాంగ్రెస్ నేతల నిరసన

నాటకాలంటూ కాంగ్రెస్ నేతల నిరసన

గడ్కరీ సమాధానంతో సంతృప్తి చెందని కాంగ్రెస్‌ నేతలు ఆయన కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టుపై గడ్కరీకి అవగాహన లేదని విమర్శించారు. పోలవరం అంశాన్ని టీడీపీ, వైసీపీ ఎంపీలు వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రస్తావించి కేంద్రంపై వత్తిడి తేవాలని అందుకు కాంగ్రెస్‌ పార్టీ కూడా సహకరిస్తుందని స్పష్టం చేశారు. పోలవరం విషయంలో బీజేపీ, టీడీపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని రఘువీరా విమర్శించారు.

అసలు చిక్కుముడి ఇదే..

అసలు చిక్కుముడి ఇదే..


గడ్కరీ మాటలతో పోలవరంపై మరో చిక్కుముడి పడినట్లయింది. పోలవరం ప్రాజెక్టుకు పెరిగిన అంచనాలను తాము ఇవ్వలేమని గడ్కరీ తేల్చి చెప్పడమే ఇందుకు కారణం. అంతేగాక, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ బాధ్యత కూడా తమది కాదని గడ్కరీ స్పష్టం చేశారు. దీంతో ఏపీ ప్రభుత్వం మరోసారి ఇబ్బందుల్లో పడినట్లయింది.

English summary
Union Water Resources Minister Nitin Gadkari has issued orders to release Rs 381 crore for completion of the Polavaram Hydro Project by 2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X