gajapthinagaram assembly round up: గజపతినగరం నియోజకవర్గంలో గెలుపెవరిది!!
విజయనగరం జిల్లాలోని ముఖ్యమైన నియోజకవర్గాలలో గజపతినగరం నియోజకవర్గం ఒకటి . రాజకీయ ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గంగా గజపతినగరం కి ఒక గుర్తింపు ఉంది. ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరగగా తొలినాళ్లల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించగా, ఏడు సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, ఆరు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు.
ఈ నియోజకవర్గంలో మొత్తం 2,04,181 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,02,524 మంది ఉండగా, మహిళా ఓటర్లు 1,01,648 మంది ఉన్నారు. ఇక రానున్న ఎన్నికలలో ప్రధాన పార్టీలైన తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఈ నియోజకవర్గాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నాయి. రాష్ట్రంలో ఏ ఒక్క సీటు వదలకుండా అన్ని పార్టీలు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాయి.

2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన బొత్స అప్పలనర్సయ్య తన సమీప ప్రత్యర్థి పై విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన కేఏ నాయుడిపై 27,001 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. ఇక ఈసారి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న టిడిపి, వైసీపీలు గెలుపు గుర్రాలకి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి.
తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపితో ఏర్పాటు చేసుకున్న పొత్తులలో భాగంగా తమ పార్టీ నుంచి కొండపల్లి శ్రీనివాస్ కు టికెట్ కేటాయించి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దించింది. ఇప్పటికే ఆయన ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఇక వైసిపి నుంచి మరో మారు బొత్స అప్పల నరసయ్య ఎన్నికల బరిలోకి దిగేందుకు రెడీ అయ్యింది వైసీపీ. ఆయన కూడా ఎన్నికల బరిలోకి దిగి ప్రచారాన్ని మొదలు పెట్టారు. దీంతో ఈ ఇరువురి మధ్య పోరు ఏ విధంగా ఉంటుంది. గజపతినగరంలో విజయం ఎవరిని వరిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications