దమ్ముంటే అసెంబ్లీని రద్దు చెయ్: కిరణ్‌కు గాలి సవాల్

Gali Muddukrishnama Naidu
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిజమైన సమైక్యవాదే అయితే ఆయనకు దమ్ముంటే వెంటనే అసెంబ్లీని రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు సవాల్ చేశారు. ఆయన టిడిపి సీనియర్ నేతలు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కిరణ్ సమైక్యవాది అయితే తక్షణం మంత్రి మండలిని సమావేశపర్చి, సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్నారు.

డిసెంబరులోనే ఎన్నికలకు వెళ్తే సమైక్యవాదమో, సీమాంధ్రవాదమో, తెలంగాణవాదమో ప్రజలు తేలుస్తారన్నారు. మంత్రివర్గంలో మెజారిటీ మంత్రులు సీమాంధ్ర నుంచే ఉన్నారని, ఆయన మంత్రివర్గ సమావేశం నిర్వహించి అసెంబ్లీ రద్దుకు తీర్మానం చేసి గవర్నర్‌కు సమర్పించాలన్నారు. అసెంబ్లీ రద్దయితే రాష్ట్ర విభజన ఆగిపోతుందని, వెంటనే ఎన్నికలు జరిగితే ప్రజలు దేనిని కోరుకొంటున్నారో తేలిపోతుందన్నారు.

పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా సోనియా గాంధీ చేతిలో ఆంధ్ర ప్రదేశ్ తయారైందని, రాష్ట్రాన్ని ఆటస్ధలంగా మార్చి అమె రాళ్ళు విసురుతోందని ముద్దు విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి అంత హడావుడి ఎందుకు? విభజనను 2014 ఎన్నికల తర్వాతకు వదిలేయండని, ఆ ఎన్నికల్లో అన్ని పార్టీలు తమ వైఖరులతో ప్రజల ముందుకు వెళ్తాయని, ప్రజలు ఎవరిని గెలిపిస్తే అదే జరుగుతుందని, ఎవరో తరుముతున్నట్లు ఇంత హడావుడి ఎందుకని ఆయన ప్రశ్నించారు.

మంత్రుల బృందం కమిటీ రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలు సందర్శించి ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని ఆయన కోరారు. విభజనకు అందరూ అంగీకరించారని దిగ్విజయ్ సింగ్ చెబుతున్నారని, అంగీకారం తెలిపిన కేంద్ర మంత్రులు, ఎంపీలు ఎవరో ఆయన బయట పెట్టాలని ముద్దు డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+