చంద్రబాబుకు షాక్: బిజెపితో జగన్ దోస్తీ, తెరవెనుక గాలి జనార్థన్ రెడ్డి?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బిజెపికి దగ్గర అవుతున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి ఈ విషయంలో తెరవెనుక చక్రం తిప్పుతున్నారని పార్ట
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బిజెపికి దగ్గర అవుతున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి ఈ విషయంలో తెరవెనుక చక్రం తిప్పుతున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.
నెలరోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోడీని వైసీపీ చీఫ్ జగన్ కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి.ఈ విషయమై అధికారపార్టీ నాయకులు వైసీపీపై విమర్శలు గుప్పించారు.
బిజెపి నాయకులకు, టిడిపి నాయకులకు మధ్య కూడ మాటల యుద్దం సాగింది.అయితే పొత్తు విషయంలో రెండు పార్టీల నాయకులు మాట్లాడకూడదని రెండు పార్టీలకు చెందిన అధినేతలు సూచించారు.
2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి టిడిపితోనే పొత్తుతో ఎన్నికలకు వెళ్తోందా లేదా ఇతర పార్టీలతో కలిసి వెళ్తోందా అనే విషయమై చర్చ కూడ లేకపోలేదు. అయితే ఈ పరిణామాలను ఇప్పటికిప్పుడే చెప్పడం తొందరపాటుగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications