రాహుల్, సోనియాలను బోఫోర్స్ గన్‌తో కాల్చినా పాపం పోదు: గాలి
చెన్నై: ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలపై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలను బోఫోర్స్‌గన్‌తో కాల్చినా ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టిన పాపం పోదని ఆయన మండిపడ్డారు.

శుక్రవారం చెన్నైలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలన్న తలంపుతో ఆఖరి నిముషంలో హడావిడిగా రాష్ట్రాన్ని విడగొట్టారని విమర్శించారు. తుప్పుపట్టిన బోఫోర్స్ గన్‌ల కొనుగోళ్ల కుంభకోణంతో రాజీవ్‌గాంధీ ఖ్యాతిని మసకబార్చిన సోనియా ఏపీని విడగొట్టి కాంగ్రెసును తుడిచిపెట్టేశారని ఆయన అన్నారు.
అందుకే ఆ తుప్పుపట్టిన బోఫోర్స్ గన్‌లతో కాల్చేసినా సోనియా, రాహుల్ గాంధీల పాపం పోదన్నారు. సోనియాను ఇటీలీకి తరిమికొడితేనే కాంగ్రెసుకు పాపపరిహారం లభిస్తుందని ఆయన అన్నారు. ఆఖరి నిముషంలో ఏపీని విడగొట్టి, ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ కే వలం మాటలతో సరి పెట్టిందన్నారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి వుంటే ఇప్పుడిన్ని తిప్పలు వుండేవి కాదన్నారు.












Click it and Unblock the Notifications