వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ మోసం చేస్తుందా అని: గల్లా తీవ్ర వ్యాఖ్యలు, విభజన చట్టం అందుకే: రామ్మోహన్ నాయుడు

|
Google Oneindia TeluguNews

Recommended Video

TDP Unsure About Govt's Assurance On AP Bifurcation Act

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అసంబద్దంగా జరిగిందని ఏపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు. ఏపీ ప్రయోజనాలకు కావాల్సిన కేటాయింపులు కేంద్ర బడ్జెట్‌లో లేవన్నారు. చంద్రబాబుతో అందుబాటులో ఉన్న టీడీపీ ఎంపీలు, నేతలు భేటీ అయిన విషయం తెలిసిందే.

చంద్రబాబుతో భేటీ అనంతరం కళా వెంకట్రావు, ఎంపీ గల్లా జయదేవ్ తదితరులు మీడియాతో మాట్లాడారు. ప్యాకేజీలోని అంశాలు కేంద్రం నెరవేర్చాలని కళా డిమాండ్ చేశారు. జగన్ పార్టీ సొంత లాభాల కోసం ప్రయత్నాలు చేస్తోందన్నారు. టీడీపీకి ఏపీ ప్రయోజనాలు ముఖ్యమని చెప్పారు.

ఏపీకి మరో శుభవార్త, విశాఖ రైల్వే జోన్‌కు ఒకే!: అలా ఐతేనే.. మారిన బాబు వ్యూహం, ఆ తర్వాతేఏపీకి మరో శుభవార్త, విశాఖ రైల్వే జోన్‌కు ఒకే!: అలా ఐతేనే.. మారిన బాబు వ్యూహం, ఆ తర్వాతే

18 పాయింట్లపై పోరాటం, జగన్ స్వప్రయోజనాల కోసమే

18 పాయింట్లపై పోరాటం, జగన్ స్వప్రయోజనాల కోసమే

విభజన చట్టంలోని హామూలు అమలు చేయాలని కళా అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగిస్తే సహించేది లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎప్పుడైనా కేంద్రాన్ని ప్రశ్నించిందా అని అడిగారు. 18 పాయింట్లపై తమ వైఖరి ఉంటుందని, పోరాటం చేస్తామన్నారు. జగన్ స్వప్రయోజనాల కోసం వైసీపీ పుట్టిందన్నారు. ప్యాకేజీ గురించి స్పష్టత రాలేదన్నారు.

బీజేపీ మద్దతుతోనే విభజన

బీజేపీ మద్దతుతోనే విభజన

గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. ఏపీ తలసరి ఆదాయం తక్కువగా ఉందని చెప్పారు. విభజనతో చాలా ఆస్తులు కోల్పోయామని చెప్పారు. ఏపీలో పరిస్థితి చక్కబడే కేంద్రం ఆధుకోవాలన్నారు. పన్నుల్లో మినహాయింపుతో పాటు ఇన్‌సెంటివ్స్ ఇవ్వాలన్నారు. బీజేపీ మద్దతుతోనే విభజన బిల్లు ఆమోదం పొందిందని గుర్తు చేశారు. విభజన సమయానికే రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉందన్నారు. ఏపీకి నష్టం జరిగితే సహించేది లేదన్నారు.

బీజేపీ మోసం చేస్తుందా అని చూస్తున్నారు

బీజేపీ మోసం చేస్తుందా అని చూస్తున్నారు


దేశంలోని అన్ని పార్టీలు ఏపీకి మద్దతిస్తున్నాయని గల్లా జయదేవ్ అన్నారు. ఇప్పుడు ఇది జాతీయ ప్రధాన అంశమైందని చెప్పారు. బీజేపీ మోసం చేస్తుందా అని అన్ని పార్టీలు అనుమానంగా చూస్తున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మనకు కేంద్రం ఎప్పుడు, ఏమి ఇస్తుందో టైమ్ లైన్ ఇవ్వాలన్నారు. కేంద్రం దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా ఏపీకి వచ్చే వరకు ఆదుకోవాలన్నారు.

మిత్రపక్షంగా ఉన్నా పోరాటం

మిత్రపక్షంగా ఉన్నా పోరాటం

విభజన తర్వాత ఏపీ ఏదైతే కోల్పోయిందో దానిని కేంద్రం సమకూర్చాలని రామ్మోహన్ నాయుడు అన్నారు. తాము ఎన్డీయేలో ఉన్నప్పటికీ, బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ప్రజల కోరిక మేరకు నడుచుకున్నామన్నారు. విభజన చట్టంలోని 19 అంశాలపై స్పష్టత లేదన్నారు. విభజన తర్వాత కోలుకోవాలనే విభజన చట్టం చేశారని బీజేపీని ఎద్దేవా చేశారు. అందుకే మిత్రపక్షంగా ఉన్నా పార్లమెంటులో పోరాడామన్నారు. చంద్రబాబు ఇంకా ఎన్నిసార్లు ఢిల్లీ రావాలన్నారు.

English summary
Telugu Desam Party MPS Galla Jayadev and Rammohan Naidu talk about BJP poll promises
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X