మహిమ గల నాణేం పేరుతో మోసం: 40 ఫోన్లు, సిమ్‌లు మార్చారు

Posted By:
Subscribe to Oneindia Telugu

శ్రీకాకుళం: తమ వద్ద ఉన్న నాణేనికి మహిమలున్నాయని ప్రజలను మోసం చేస్తున్న ఓ దొంగల ముఠా పోలీసులకు చిక్కింది. ఆదివారం శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి ఆ వివరాలు తెలిపారు.

విజయనగరానికి చెందిన దేవుడుబాబు అనే వ్యక్తి గండ్రేటి సురేష్‌తోకలిసి శ్రీరామచంద్రులు బొమ్మవున్న ఓ నాణేన్ని సంపాదించాడు. దీంతో సొమ్మును ఏ విధంగా సంపాదించాలన్నదానికి పక్కా పథకం రచించాడదు. విశాఖపట్నానికి చెందిన వేమిరెడ్డి ప్రసాదు, కోరాడ రమేష్‌తో పాటు మరో ఇద్దరు గిరిజనులను తమ ముఠాలో చేర్చుకున్నారు. సంపన్నుల వద్దకు వెళ్ళి, ముందుగా వారికి నమ్మకం కలిగేలా, కొన్ని రసాయనాలతో డబ్బును రెట్టింపు చేస్తామని నమ్మించి మోసం చేస్తున్నారు.

 gang arrested for cheating with a coin

విశాఖపట్నానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తివద్దనుంచి 50 లక్షలు దోచుకొని పరారయ్యారు. దాంతో ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులను పట్టుకుని ఆదివారం అరెస్టుచేశారు. పోలీసులు అనుసరించిన వ్యూహాన్ని కూడా తిప్పికొట్టేలా నిందితులు సుమారు 30, 40 సెల్‌ఫోన్లు, సిమ్‌లు మార్చినట్టు విచారణలో తేలింది. 47 లక్షల రూపాయల నగదుతో పాటు వారు వినియోగించే బొమ్మ తుపాకి, నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A gang ahs been nabbed by Srikakulam police in Andhra Pradesh for cheating with a coin.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X