'పరిటాల, మద్దెల చెర్వు కుటుంబాల మధ్య విభేదాలకు కారణమదే, వైఎస్ చెప్పినట్టు వింటే మరోలా ఉండేది'

Posted By:
Subscribe to Oneindia Telugu
  ఆ కుటుంబాల విబేధాలకు కారణమదే..! వైఎస్ చెప్పినట్టు వింటే బాగుండేది..

  హైదరాబాద్: చెప్పుడు మాటల వల్లే పరిటాల రవి కుటుంబానికి మద్దెల చెరువు సూరి కుటుంబానికి మధ్య విబేధాలు వచ్చాయని మద్దెల చెరువు సూరి సోదరి గంగుల హేమలతా రెడ్డి అభిప్రాయపడ్డారు. వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే సూరి అలా తయారయ్యేవాడు కాదని ఆమె అభిప్రాయపడ్డారు.

  గంగుల హేమలతారెడ్డితో ఓ తెలుగు ఛానెల్ ఇంటర్వ్యూ చేసింది.ఈ ఇంటర్వ్యూలో పరిటాల రవి కుటుంబానికి, మద్దెల చెరువు సూరి కుటుంబానికి మధ్య నెలకొన్న విభేధాలతో పాటు పలు అంశాలను ఆమె ప్రస్తావించారు.హేమలతారెడ్డి మద్దెల చెర్వు సూరి బాబాయ్ కూతురు.

  తన కళ్ళ ముందే కుటుంబ సభ్యులంతా చనిపోవడంతా సూరి అలా తయారయ్యాడని ఆమె అభిప్రాయపడ్డారు.తనంటే తన సోదరుడికి అపారమైన ప్రేమ ఉండేదని చెప్పారు.

  సూరి ఆస్తులకు నేను బినామీ కాదు

  సూరి ఆస్తులకు నేను బినామీ కాదు

  మద్దెల చెరువు ఆస్తులను నేను బినామీగా ఉంటే తన సోదరుడు బతికేవాడని గంగుల హేమలతా రెడ్డి చెప్పారు.తన ఆస్తులకు భాను బినామీగా ఉన్నందునే మట్టుబెట్టాడని హేమలతా రెడ్డి అభిప్రాయపడ్డారు. తనను ఆ ఆస్తులకు బినామీగా చేశారనేది వాస్తవం కాదని చెప్పారు. ఒకవేళ అలా జరిగి ఉంటే సూరి బతికేవాడని ఆమె చెప్పారు.

  చెప్పుడు మాటల వల్లే పరిటాల రవి కుటుంబంతో విబేధాలు

  చెప్పుడు మాటల వల్లే పరిటాల రవి కుటుంబంతో విబేధాలు

  చెప్పుడు మాటల వల్లే పరిటాల రవి కుటుంబంతో తమ సోదరుడు మద్దెల చెరువు సూరి కుటుంబానికి విబేధాలు ఏర్పడినట్టు తమ కుటుంబసభ్యులు చెప్పిన దాని బట్టి తనకు అర్ధమైందని హేమలతా రెడ్డి అభిప్రాయపడ్డారు.పరిటాల రవి తండ్రి శ్రీరాములయ్య, మద్దెల చెరువు సూరి తండ్రి నారాయణరెడ్డి మంచి స్నేహితులుగా ఉండేవారని, అయితే వీరిద్దరి మద్య చెప్పుడు మాటల కారణంగానే అంతరం పెరిగిందని ఆమె అభిప్రాయపడ్డారు ఈ కారణంగానే రెండు కుటుంబాల మధ్య వైరం ఏర్పడిందన్నారు.

  టీవి బాంబు నుండి సూరి ఇలా తప్పించుకొన్నాడు

  టీవి బాంబు నుండి సూరి ఇలా తప్పించుకొన్నాడు

  దసరా రోజున మద్దెల చెరువు సూరి తృటిలో తప్పించుకొన్నాడని గంగుల హేమలతారెడ్డి చెప్పారు. దసరా పర్వదినం రోజున పదే పదే పిలిచిన సూరి తమ ఇంటికి భోజనానికి రాలేదని ఆమె గుర్తుకు తెచ్చుకొన్నారు. అయితే భోజనం చేసేందుకు ఎంతసేపు వెయిట్ చేయాలని తన సోదరి సూరిని తీసుకొచ్చిందని చెప్పారు. సూరితో పాటు తామంతా భోజనం చేసి చేతులు కడుక్కొంటున్న సమయంలోనే సూరి ఇంట్లో టీవి బాంబు పేలుడు చోటుచేసుకొందని చెప్పారు. అయితే ఆ సమయంలో సూరి ఇంట్లో లేకపోవడంతోనే బతికి బయటపడ్డానని ఆమె చెప్పారు.

  నక్సలైట్లు దాడులు చేస్తారని భయంగా

  నక్సలైట్లు దాడులు చేస్తారని భయంగా

  పరిటాల శ్రీరాములయ్య హత్య తర్వాత తమ ఇళ్ళపై నక్సలైట్లు దాడులు చేస్తారనే భయంగా గడిపామని చెప్పారు.తమ తల్లిదండ్రులు ఆత్మరక్షణ కోసం ఏర్పాట్లు చేసుకొనేవారని ఆమె గుర్తు చేశారు. కానీ,ఏనాడూ కూడ నక్సలైట్లు దాడులు చేయలేదన్నారు. టీవి బాంబు ఘటనను కూడ నక్సలైట్లపైకి తోశారని చెప్పారు. కానీ, ఆ రోజున వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే సూరి అలా మారిపోయేవాడు కాదని ఆమె అభిప్రాయపడ్డారు.

  గొడవలు వద్దరని చెప్పా

  గొడవలు వద్దరని చెప్పా

  పరిటాల రవిని చంపాలనే ఉద్దేశ్యంతో మద్దెల చెరువు జూబ్లిహిల్స్‌లో కారు బాంబు పెట్టాడనే ఆరోపణలపై కూడ ఆమె స్పందించారు. అయితే ఈ ఘటనలో అమాయకులు చనిపోవడం పట్ల బాధపడ్డానని చెప్పారు. గొడవలు వద్దని తన సోదరుడు సూరికి చెప్పాను. కానీ ఆ మాటలు విని మౌనంగా ఉండిపోయాడని ఆమె చెప్పారు.

  వైఎస్ చెప్పినట్టు వింటే పరిస్థితి మరోలా ఉండేది

  వైఎస్ చెప్పినట్టు వింటే పరిస్థితి మరోలా ఉండేది

  వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పినట్టు సూరి వింటే పరిస్థితి మరోలా ఉండేదని ఆమె అభిప్రాయపడ్డారు. పరిటాల రవి విషయంలో వైఎస్ చేసిన రాజీ ఫార్మూలాను సూరి ఒప్పుకోలేదని హేమలతా రెడ్డి గుర్తు చేసుకొన్నారు. తన తండ్రినే తాను కోల్పోయాయని వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ ముందు ప్రస్తావించారని ఆమె చెప్పారు. కానీ ఆ విషయమై సూరి ఒప్పుకొంటే పరిస్థితి మరోలా ఉండి ఉండేదని ఆమె అభిప్రాయపడ్డారు.

  వైఎస్ కుటుంబంతో విబేధాలు, చెన్నారెడ్డి ఒప్పుకోలేదు: కందుల రాజమోహన్ రెడ్డి

  క్రికెట్లో సూరి ఆల్ రౌండర్

  క్రికెట్లో సూరి ఆల్ రౌండర్

  మద్దెల చెరువు సూరి క్రికెట్ ఆడేవాడని హేమలతారెడ్డి గుర్తు చేసుకొన్నారు. సూరి బ్యాటింగ్, బౌలింగ్ చేసేవారని చెప్పారు. క్రికెట్ ఆటలో ఆయన ఆల్ రౌండర్ ప్రతిభను కనబర్చేవారని చెప్పారు. ఇంటర్ వరకు అనంతపురంలో చదివారని ఆమె గుర్తు చేశారు.

  నా సోదరుడిని ఓడించాడు, వైఎస్ఆర్‌పై పోటీ, ముందే చెప్పా: కందుల రాజమోహన్ రెడ్డి

  పరిటాల శ్రీరామ్ పెళ్ళికి వెళ్లే ఛాన్స్ లేదు

  పరిటాల శ్రీరామ్ పెళ్ళికి వెళ్లే ఛాన్స్ లేదు

  పరిటాల శ్రీరామ్ పెళ్ళికి గంగుల భానుమతిని పిలిచేందుకు పరిటాల సునీత సిద్దంగా ఉన్నారని, ఆమె పిలిస్తే గంగుల భానుమతి కూడ వెళ్ళేందుకు సిద్దగా ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం సాగిందని చెప్పారు. అయితే భానుమతి ఈ పెళ్ళికి వెళ్ళదని తాము భావించామని హేమలతారెడ్డి చెప్పారు.

  పెదనాన్న బతికి ఉంటే రాజకీయాల్లోకి వచ్చేదాన్ని

  పెదనాన్న బతికి ఉంటే రాజకీయాల్లోకి వచ్చేదాన్ని

  పెదనాన్న బతికి ఉంటే తాను ఖచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉండేదని హేమలతా రెడ్డి చెప్పారు. పెద్దనాన్న తన చిన్నతనంలో తనను ఎక్కువగా ఇష్టపడేవారని చెప్పారు. పెద్ద నాన్ని కుటుంబంలో ఎవరూ లేరని చెప్పారు. ఇది పెద్ద లోటన్నారు. జైలు నుండి బయటకు వచ్చిన అన్న కొంత కాలానికే చనిపోవడం పట్ల ఆమె ఆవేదనను వ్యక్తం చేశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Gangula Hemalatha speaking about Maddelacheruvu Suri, has shared about the education of Suri. Hemalatha explained that Maddelacheruvu Suri's education went well until his father was alive and shared that Suri studied till 12th standard in Anantapur District.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి