వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శృంగవరపు కోటలో 'అది' శృతిమించింది: ఓవైపు గంజాయి.. మరోవైపు సహజీవనాలు..

ఎస్ కోటలో విద్యా సంస్థలు కొలువుదీరడంతో ఏజెన్సీ ప్రాంతాల విద్యార్థులు ఇక్కడే గదులు అద్దెకు తీసుకుని చదువుకుంటున్నారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Living Together Relationships Increasing ఓవైపు గంజాయి.. మరోవైపు సహజీవనాలు | Oneindia Telugu

విజయనగరం: మాదకద్రవ్యాల ఏరివేతకు ఎన్ని చర్యలు తీసుకున్నా.. గుట్టు చప్పుడు కాకుండా సరఫరా అవుతూనే ఉంది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల నుంచే గంజాయి సరఫరా అవుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

విజయనగరంలోని ఎస్ కోట(శృంగవరపు కోట)లో కాలేజీ అబ్బాయిలు, అమ్మాయిల చేత గంజాయిని సరఫరా చేయిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అలా సంపాదించిన డబ్బుతో ఇక్కడ యువత పెడదోవ పడుతున్నట్టు చెబుతున్నారు.

 ఎస్ కోట అడ్డా:

ఎస్ కోట అడ్డా:

విజయనగరం జిల్లాలో ఉన్న ఎస్ కోట ఏజెన్సీ ప్రాంతాలకు ప్రధాన పట్టణంగా ఉంది. అరకు, పాడేరు, అనంతగిరి, డుంబ్రిగూడ, హకుంపేట ప్రజలు ఏ అవసరమైనా ఇక్కడికే వస్తుంటారు. ఇక్కడి నుంచి కాస్త ముందుకెళ్తే అరకు, వెనక్కి వెళ్తే విశాఖ వస్తాయి. విద్యా సంస్థలు కొలువుదీరడం, షాపింగ్ సౌకర్యం ఉండటంతో చాలామంది ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు ఎస్ కోటకే వచ్చి పోతుంటారు.

 గంజాయి సరఫరా:

గంజాయి సరఫరా:

ఎస్ కోటలో విద్యా సంస్థలు కొలువుదీరడంతో ఏజెన్సీ ప్రాంతాల విద్యార్థులు ఇక్కడే గదులు అద్దెకు తీసుకుని చదువుకుంటున్నారు. ఎక్కువగా డిగ్రీ విద్యార్థులే అద్దె గదుల్లో ఉంటున్నట్టు తెలుస్తోంది. వీరిని టార్గెట్ చేసుకున్న కొంతమంది వ్యక్తులు.. వీరిచేత అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారు. డబ్బు ఆశకు లొంగుతున్న విద్యార్థులు వారికి పనిచేసి పెడుతున్నారు. ఇక్కడి నుంచి హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాలకు గంజాయిని తరలిస్తున్నారు.

 రూ.10వేల వరకు:

రూ.10వేల వరకు:

నిజానికి వాటిని తరలిస్తున్న యువకులకు కూడా ఆ విషయం గురించి తెలియదు. వాళ్ల చేతిలో పెట్టిన ప్యాక్ ను చెప్పిన అడ్రస్ లో ఇచ్చేసి వస్తారు. అలా చేసినందుకు గాను రూ.5వేల నుంచి రూ.10వేల వరకు ముడుతుంది. ఆ డబ్బుతో స్మార్ట్ ఫోన్లు, షికార్లతో ఎంజాయ్ చేస్తున్నారు. డబ్బు కారణంగా వీరు తప్పుదోవ పడుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి.

 ఒకే గదుల్లో ఉంటున్నారు:

ఒకే గదుల్లో ఉంటున్నారు:

ఎస్ కోటలోని చాలా ఇళ్లలో అబ్బాయిలు, అమ్మాయిలు ఒకే గదిలో ఉంటున్నట్టు చెబుతున్నారు. తొలుత హాస్టళ్లలో చేరే విద్యార్థినులు.. ఆ తర్వాత కాలేజీ పరిచయాలతో బాయ్ ఫ్రెండ్స్ గదులకు వెళ్తున్నట్టు తెలుస్తోంది.

అక్కడే రెండు, మూడు రోజులు గడపడం, ఒకవేళ సదరు ఇంటి ఓనర్స్ అడిగితే వాళ్లను కన్విన్సింగ్ చేసేలా ఏదో ఒకటి చెప్పడం చేస్తున్నారు. హద్దులు దాటుతున్న ఈ వ్యవహారం అమ్మాయిలు అబార్షన్ చేయించుకునే వరకు వెళ్తోందని స్థానిక డాక్టర్లు చెబుతున్నట్టు సమాచారం.ఈ విషయాలేవి తల్లిదండ్రులకు తెలియకుండా విద్యార్థులు జాగ్రత్త పడుతున్నారు.

English summary
Living together relationships are increasing in Shrungavarapu Kota, Vizianagaram. Male Students are earning money by supplying ganja
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X