బాబు సర్కారుపై అలక: గన్‌మెన్‌ను సరెండర్ చేసిన ఎమ్మెల్యే వంశీ

Subscribe to Oneindia Telugu

విజయవాడ: గన్నవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సొంత పార్టీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. టు ప్లస్ టు గన్‌మెన్‌లు కావాలని ఎమ్మెల్యే వంశీ ప్రభుత్వాన్ని కోరారు. అయితే, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ మంగళవారం తన గన్‌మెన్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ.. తన గన్‌మెన్‌కు కేవలం ఒక పిస్టల్ మాత్రమే ఇచ్చారని, కనీసం కార్బన్ వెపన్ కూడా ఇవ్వలేదని చెప్పారు.

It is said that Gannavaram TDP MLA Vallabhaneni Vamsi surrenders gunman

మూడున్నరేళ్ల నుంచి భద్రతను పెంచమని కోరుతున్నా.. సర్కారు నుంచి స్పందన రాలేదని అన్నారు. అంతేగాక, తన ఆయుధాలు మూడింటిని లైసెన్స్ రెన్యూవల్ కోసం పోలీస్ స్టేషన్‌లో అప్పగించానని, వాటిని కూడా తిరిగి ఇవ్వలేదని వంశీ వివరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Gannavaram TDP MLA Vallabhaneni Vamsi surrenders gunman

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X