గన్నవరం - షిర్డీ విమానం రెడీ : షెడ్యూల్ - టికెట్ ధరలు ఇలా..!!

విజయవాడ నుంచి షిర్డీకి నేరుగా విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. షెడ్యూల్..టికెట్ ధరలు ఖరారు చేసారు.

షిర్డీకి వెళ్లే సాయి భక్తులకు గుడ్ న్యూస్. విజయవాడ నుంచి షిర్డీకి నేరుగా విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు ఇక్కడి నుంచి షిర్డీ వెళ్లాలంటే రైలు..రోడ్డు మార్గాల ద్వారా వెళ్లాల్సి వచ్చేది. రైళ్ల సంఖ్య ఏపీ నుంచి తక్కువగానే ఉన్నాయి. విమాన సర్వీసు శంషాబాద్ నుంచి షిర్డీకి కొనసాగుతోంది. ఏపీలోని ఏ విమానాశ్రయం నుంచి షిర్డీకి సర్వీసు లేదు.

ఇప్పుడు షిర్డీకి ఏపీ నుంచి వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో గన్నవరం నుంచి నేరుగా షిర్డీకి విమానం నడపాలని ఇండిగో సంస్థ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సర్వీసు ప్రారంభ ముహూర్తంతో పాటుగా షెడ్యూల్.. టికెట్ ధరలను ప్రకటించింది.

విజయవాడ టు షిర్డీ నేరుగా

విజయవాడ టు షిర్డీ నేరుగా

విజయవాడ నుంచి నేరుగా షిర్డీకి మార్చి 26 నుంచి ప్రతీ రోజు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఇండిగో విమాన సంస్థ ప్రకటన చేసింది. ఈ మేరకు అధికారికంగా షెడ్యూల్ వెల్లడించింది. ప్రతీ రోజు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఏటీఆర్ 72-600 విమానం షిర్డీకి ఖరారు చేసారు.

72 మంది ప్రయాణీకుల సామర్ధ్యంతో ఈ విమానం గన్నవరం - షిర్డీ- గన్నవరం మధ్య సర్వీసుకు నిర్ణయించారు. ప్రతీ రోజు మధ్నాహ్నం 12.25 గంటలకు గన్నవరం లో బయల్దేరే ఈ విమానం 3 గంటలకు షిర్డీకి చేరుకుంటుంది. అదే విధంగా ప్రతీ రోజు షిర్డిలో మధ్యాహ్నం 2.20 గంటలకు బయల్దేరి సాయంత్రం 4.35 గంటలకు గన్నవరం చేరుకుంటుందని సంస్థ ప్రకటించింది. 2 గంటల 50 నిమిషాల్లోనే షిర్డీకి చేరుకోవచ్చని విమానయాన అధికారులు వెల్లడించారు.

ప్రయాణ వేళలు .. టికెట్ ధరలు ఖరారు

ప్రయాణ వేళలు .. టికెట్ ధరలు ఖరారు

గన్నవరం నుంచి షిర్డీకి ప్రారంభ టికెట్ ధర రూ 4,246గా నిర్ణయించారు. అదే విధంగా షిర్డీ నుంచి గన్నవరం కు టికెట్ ధర రూ 4,639గా నిర్దారించారు. ఏపీ జిల్లాల నుంచి ఇప్పటి వరకు షిర్డీ వెళ్లాంటే రైలు ప్రయాణం అందుబాటులో ఉంది. లేదంటే రోడ్డు మార్గం ద్వారా షిర్డీకి చేరుకోవాల్సి వచ్చేంది. షిర్డీలో విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన తరువాత శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ప్రారంభించారు.

శంషాబాద్ నుంచి షిర్డీకి విమాన ప్రయాణం గంటా 34 నిమిషాలు గా ఉంది. టికెట్ ధర రూ 4,086 గా కొనసాగుతోంది. ఇక, ఇప్పుడు నేరుగా గన్నవరం నుంచి షిర్డీకి విమాన సర్వీసులు అందుబాటులోకి రావటం ద్వారా ఆక్యుపెన్సీ రేషియా కూడా బాగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ప్రయాణీకుల ఆదరణ పై అంచనాలు

ప్రయాణీకుల ఆదరణ పై అంచనాలు

ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి షిర్డీకి నిత్యం సాయంత్రం బయల్దేరే మన్మాడ్ ఎక్స్ ప్రెస్ కు భారీ డిమాండ్ ఉంది. నిత్యం వెయిటింగ్ లిస్టు కనిపిస్తోంది. శంషాబాద్ నుంచి షిర్డీకి వెళ్లే విమాన సర్వీసుల్లోనూ ఏపీ నుంచి వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా ఏపీ జిల్లాల నుంచి షిర్డీకి వెళ్లే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో తొలుత 72 మంది ప్రయాణీకుల సామర్ధ్యం ఉన్న సర్వీసును ప్రారంభిస్తున్నారు.

ప్రయాణీకుల నుంచి వచ్చే ఆదరణ పరిశీలించిన తరువాత అవసరమైన విధంగా నిర్ణయాలు తీసుకుంటామని విమానయాన అధికారులు చెబుతున్నారు. దీంతో..షిర్డీ వెళ్లాలనుకొనే భక్తులకు ఈ విమాన సౌకర్యం ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+