వైఎస్ హయాంలోనే...: జగన్ వ్యాఖ్యలకు గంటా రిప్లై, ఈశ్వరి వ్యాఖ్యలపై జూపూడి ప్రశ్న
విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావు అసమర్థ ప్రతిపక్ష నాయకుడిగా అభివర్ణించారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే బాక్సెట్ తవ్వకాల అంశం తెరపైకి వచ్చిందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. బాక్సైట్‌పై మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదని ఆయన అన్నారు.
పనిగట్టుకుని విమర్శలు చేయడం సరి కాదని ఆయన జగన్‌కు సూచించారు. ప్రజాభిప్రాయం మేరకే ప్రభుత్వం బాక్సెట్ తవ్వకాలపై నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఇంటర్, పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామని అన్నారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
వచ్చే ఏడాది ప్రభుత్వ పాఠశాలల భవనాలకు ఒకే రంగు వేస్తామని చెప్పారు. వచ్చే జన్మభూమిలో ఆకస్మిక తనిఖీలు జరుగుతాయని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు ఈశ్వరి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర రావు చెప్పారు. జగన్ సమక్షంలోనే ఈశ్వరి అలా మాట్లాడడం దేనికి సంకేతమని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అడిగారు.
ఈశ్వరి వ్యాఖ్యలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమర్థిస్తోందా అని ఆయన అడిగారు. ప్రజాభిప్రాయం భిన్నంగా ఉండడంతో బాక్సైట్ తవ్వకాలపై కేంద్రం ఇచ్చిన జీవో అమలను నిలిపేశామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications