వారి మాట వినకుంటే జగన్‌లా తయారవుతారు: గంటా, మళ్లీ వైసిపి సవాల్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి గంటా శ్రీనివాస రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు.

తల్లి మాట వినకపోతే రాహుల్ గాంధీలా మారతారని, తండ్రి మాట వినకపోతే అఖిలేష్ యాదవ్‌లా మారతారని, ఇద్దరి మాటా వినకపోతే లేదా జనం మాట వినకుంటే వైసిపి అధినేత జగన్‌లా తయారవుతారని గంటా వ్యాఖ్యానించారు.

అసెంబ్లీలో జగన్ అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. పదో తరగతి ప్రశ్నాపత్రం మాల్ ప్రాక్టీస్‌పై సీబీఐ దర్యాప్తు కోరటం ఏమిటన్నారు. ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుందని, ఇంకేం కావాలని ప్రశ్నించారు.

ప్రశ్నాపత్రం లీకేజ్: సాక్షి స్టింగ్ ఆపరేషన్‌పై చంద్రబాబు డౌట్

Ganta Srinivas Rao interesting comments on YS Jagan

ఈ అంశంలో త‌మ ప్రభుత్వమే దర్యాప్తు చేసి నారాయణ కళాశాల పేరును బయటపెట్టిందన్నారు. అంతేగాని ప్రతిపక్షం ఆ పేరును బ‌య‌ట‌పెట్ట‌లేద‌ని చెప్పారు. ఈ విష‌యంపై మొద‌ట‌ తామే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ లీకేజీ వెనుక ఎవరు ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

జగన్ సవాల్

ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో సీబీఐతో విచారణ జరిపించాలని జగన్ అంతకుముందు అన్నారు. సీబీఐ విచారణ జరిపిస్తే మంత్రి నారాయణ పాత్ర బయటకు వస్తుందన్నారు. దమ్ముంటే ఈ సవాల్ స్వీకరించాలని జగన్ అన్నారు.

పేపర్ లీక్‌కు కారకులైన వారి విషయం ప్రస్తావించకుండా లీక్ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సాక్షి విలేకరి గురించి మాట్లాడుతున్నారన్నారు. సాక్షి తరఫున తమ పూర్తి సహకారం ఉంటుందన్నారు. మా వద్ద ఉన్న ఆధారాలు సీబీఐకి ఇస్తామన్నారు. కాగా, ఇటీవల అసెంబ్లీలో సవాళ్ల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Minister Ganta Srinivas Rao interesting comments on YSR Congress Party chief YS Jaganmohan Reddy.
Please Wait while comments are loading...