జగన్ పై గంటా శ్రీనివాస్ హాట్ కామెంట్స్-విజయమ్మ లేఖతో జరిగేది ఇదే..!
ఏపీలో విపక్ష వైసీపీని, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఇవాళ ఘాటు విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా రష్మిలతో ఆస్తుల వివాదం నుంచి వైసీపీ నేతల రాజీనామాల వరకూ పలు అంశాలపై జగన్ ను నిలదీస్తూ గంటా తీవ్ర విమర్శలు చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమంతో పాటు అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తుంటే, వాలంటీర్లు లేకుండా పెన్షన్స్ ఇస్తుంటే వైసీపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.
చెల్లి, తల్లితో జగన్ ఆస్తుల వివాదంపై గంటా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి , ఓ రాజకీయ పార్టీకి ఏం న్యాయం చేస్తారంటూ గంటా ప్రశ్నించారు. గతంలో పార్టీ కోసం పని చేసిన వారంతా ఒక్కొక్కరుగా వైసీపీని వీడి బయటకు వస్తున్నారన్నారు. త్వరలో మరి కొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు. తాజాగా విజయమ్మ రాసిన లేఖతో పార్టీ వైసీపీ మునిగిపోయిందన్నారు.ఇప్పుడు జగన్ తప్ప ఎవరూ అక్కడ మిగలరన్నారు.

2004లో 92 లక్షల రూపాయలుగా ఉన్న వైఎస్ జగన్ ఆస్తులు..2009నాటికి రూ.370 కోట్లకు చేరాయని గంటా ఆరోపించారు. .
కేవలం జగన్ మీద 47 కేసులు ఉన్నాయని, చంబల్ దేవి తర్వాత అత్యధిక కేసులు ఉన్నది ఆయన మీదే ఉన్నాయని
గంటా విమర్శించారు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంలో కేంద్రంతో మాట్లాతామని, అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్తామని జగన్ తెలిపారు. అలాగే రుషి కొండ భవనాల విషయంలోనూ ఏం చేయాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీల్ని నిలబెట్టుకుంటుందని గంటా తెలిపారు.












Click it and Unblock the Notifications