అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దాగుడుమూతలకు గంటా శ్రీనివాసరావు గుడ్ బై!!

|
Google Oneindia TeluguNews

గంటా శ్రీనివాసరావు... ఒకసారి విజయం సాధించిన నియోజకవర్గం నుంచి రెండోసారి పోటీచేసే అలవాటు లేదు. అలాగే ఆ నియోజకవర్గాన్ని ఏమైనా అభివృద్ధి పథంలో నడిపిస్తారా? అంటే ప్రజలకే కాదు.. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండరు. అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే ఆయన గెలిచిన నియోజకవర్గం మాత్రం బిక్క మొహం వేసుకొని చూస్తుంటుంది.

ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో?

ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో?


ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో ఉన్నారు? అనేది రాజకీయ వర్గాల్లో నలుగుతున్న చర్చ. తెలుగుదేశం పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరాక గంటా ఎక్కడున్నారో పార్టీ అధినేతకు కూడా సమాచారం లేదు. ఏనాడూ అధినేతను కలిసే ప్రయత్నం చేయలేదు. ఆయన తరఫున నియోజకవర్గంలో ఒకరిద్దరు పనులు చక్కబెడుతుంటారు. మూడున్నర సంవత్సరాల నుంచి దాగుడు మూతలాడుతున్న గంటా రాజకీయానికి ఒక స్పష్టత వచ్చింది. ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉన్నారో? తాను ఏ పార్టీలో కొనసాగబోతున్నానో నూతన సంవత్సరం సందర్భంగా స్పష్టతనిచ్చారు.

వైసీపీలో అంటూ.. వార్తలు వచ్చినప్పటికీ..

వైసీపీలో అంటూ.. వార్తలు వచ్చినప్పటికీ..


గెలిచే పార్టీలోనే, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే పార్టీలోనే ఉంటారనే టాక్ గంటా మీద ఉంది. గతానికన్నా ఇప్పుడు ఈ విషయంలో అతనిమీద వ్యతిరేక భావాన్ని పెంపొందిస్తోంది. తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యంలోకి, ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ లోకి, కాంగ్రెస్ నుంచి మళ్లీ తెలుగుదేశం లోకి వచ్చారు. తాజాగా ఆయన వైసీపీలో చేరతారంటూ వార్తలు వచ్చాయికానీ ఆయన ఖండించే ప్రయత్నం చేయలేదు. దీంతో జగన్ ను కలిసి పార్టీ మారడమే తరువాయి అన్నట్లుగా గంటా రాజకీయం మొదలైపోయింది.

గ్రీటింగ్ కార్డుపై చంద్రబాబు ఫొటో

గ్రీటింగ్ కార్డుపై చంద్రబాబు ఫొటో

తర్వాత ఏమనుకున్నారో ఏమిటో తెలియదుకానీ మళ్లీ గంటా వైపు నుంచి ఎటువంటి చడీచప్పుడు వినిపించలేదు. వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా డిసెంబరు 26వ తేదీన విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమం వెనక గంటా ఉన్నారనేది బహిరంగ రహస్యం. పార్టీలు మారే విషయంలో వ్యతిరేకత పెరుగుతుండటంతో కాపు నాయకుడిగా రూపాంతరం చెందారు. రానున్న ఎన్నికల్లో అనకాపల్లి, భీమిలి, చోడవరం నియోజకవర్గాల్లో ఒకదాన్నుంచి పోటీచేయాలనే యోచనలో ఉన్నారు. ఈ మూడింటిలో ఆయన భీమిలీని ఫైనల్ చేసే అవకాశం ఉందని గంటా సన్నిహితులు చెబుతుంటారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గంటా విడుదల చేసిన గ్రీటింగ్ కార్డుమీద చంద్రబాబు ఫొటోను ''ఈ నూతన సంవత్సరం మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ ప్రజలందరికీ 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు'' అని ముద్రించారు. కార్డుకు కుడివైపున పై భాగంలో చంద్రబాబు ఫొటోను ముద్రించారు. దీన్నిబట్టి టీడీపీలోనే గంటా కొనసాగాలనుకుంటున్నారని, చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజల స్పందన కూడా ఆయన్ను పునరాలోచనలో పడేలా చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

English summary
Ganta Srinivasa Rao... is not in the habit of contesting for the second time from the constituency he has won once.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X