పూర్వ విద్యార్థికి ఉత్తరం రాసిన మంత్రి గంటా
‘బడిరుణం తీర్చుకుందాం’ ఉత్తరాల కార్యక్రమం"లో భాగంగా విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పూర్వ విద్యార్థికి ఉత్తరం రాశారు.
గుంటూరు: 'బడిరుణం తీర్చుకుందాం' ఉత్తరాల కార్యక్రమం"లో భాగంగా విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పూర్వ విద్యార్థికి ఉత్తరం రాశారు. విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొని బడి అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెరగాలని అన్నారు.
తన వంతుగా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఐఆర్ఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న జె. సిరి కుమార్‌కు లేఖ రాసి... బడి రుణం తీర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో విశాఖ ఎస్ఎస్ఏ పీవో టి. శివరామ్ ప్రసాద్, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి ఏ. స్వప్న ప్రియారెడ్డి పాల్గొన్నారు.













Click it and Unblock the Notifications