విశాఖ కాలేజీల్లో డ్రగ్స్.. నాకు సమాచారం ఉంది, గంజాయి సాగు కూడా: గంటా
డ్రగ్స్ విషయమై ఆయా కాలేజీల యాజమాన్యాలను ఇప్పటికే హెచ్చరించామని గంటా తెలిపారు.
విశాఖపట్నం: ఓవైపు హైదరాబాద్‌ను డ్రగ్స్ రాకెట్ కుదిపేస్తుంటే.. మరోవైపు విశాఖలోను డ్రగ్స్ మూలాలు ఉన్నాయంటున్నారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు. విశాఖలోని పలు కాలేజీల్లో డ్రగ్స్ వాడుతున్నట్లుగా తనకు స్పష్టమైన సమాచారం ఉందని వ్యాఖ్యానించారు.
డ్రగ్స్ విషయమై ఆయా కాలేజీల యాజమాన్యాలను ఇప్పటికే హెచ్చరించామని గంటా తెలిపారు. విశాఖ ప్రాంతంలో గంజాయి సాగు జరుగుతోందని, అధికారులు దాన్ని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ.. పూర్తి స్థాయిలో నియంత్రించలేకపోతున్నారని అంటున్నారు.

ఇటీవలి సమావేశంలో గంజాయి నియంత్రణ గురించి సీఎం చంద్రబాబు ప్రస్తావించారని, అవసరమైతే డ్రోన్స్, హెలికాప్టర్ కూంబింగ్ లు నిర్వహించాలని ఆయన ఆదేశించినట్లుగా చెప్పారు. ఏదో చిన్న చిన్న కేసులు పెట్టి కేసులను క్లోజ్ చేసే పరిస్థితి ఉండవద్దని అన్నారు. గంజాయి సాగు వెనుక ఏ స్థాయి వ్యక్తులు ఉన్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. డ్రగ్స్ రాకెట్ విషయంలో హైదరాబాద్ లాగా విశాఖ మారకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications