జనవరి 6 లోపు నోటిఫికేషన్లు ఇవ్వలేదో....విసిలకు మంత్రి గంటా వార్నింగ్....

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: నిరుద్యోగులైన పట్టభధ్రులకు శుభవార్త....ఉన్నత విద్య అభ్యసించి బోధనారంగం వైపే వెళ్లాలని నిరీక్షిస్తున్నఆశావాహులకు చక్కటి అవకాశం రాబోతుంది. వివిధ యూనివర్శిటీల్లో టీచింగ్ స్టాఫ్ పోస్టులకు అతి త్వరలో నోటిఫికేషన్లు జారీకానున్నాయి. మంత్రి గంటా విసి లకు ఈ విషయమై స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎందుకంటే...

ఎట్టిపరిస్థితుల్లోనూ జ‌న‌వ‌రి 6లోగా యూనివ‌ర్శ‌ిటీల్లో టీచింగ్ స్టాఫ్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్లు విడుద‌ల చేయాల్సిందేన‌ని మంత్రి గంటా విసిలను హెచ్చరించారు. ఈ విషయమై ఇంకే కారణాలు వినేదిలేదని

విశ్వ‌విద్యాల‌యాల వైస్ ఛాన్స‌ల‌ర్ల‌కు మంత్రి గంటా శ్రీనివాస‌రావు

తేల్చిచెప్పారు. ఉన్నత విద్యా శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ‌ప‌ట్నం నుంచి వీడీయో కాన్ఫ‌రెన్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని యూనివ‌ర్శ‌టీల ఉప‌కుల‌ప‌తులు, ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

 విసిలకు వార్నింగ్...

విసిలకు వార్నింగ్...

విశ్వ‌విద్యాల‌య బోధ‌నా వ్య‌వ‌స్థ‌ను మ‌రింత పరిపుష్టం చేసేందుకు ఖాళీగా వున్నఅధ్యాప‌క పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నామ‌ని, దీనికి అనుగుణంగా వైస్ చాన్స‌ల‌ర్లు అధ్యాప‌క పోస్టుల నోటిఫికేష‌న్లు జ‌న‌వ‌రి 6,2018 క‌ల్లా ఇవ్వాల్సిందేనని రాష్ట్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావు స్ప‌ష్టం చేశారు. అలా ఇవ్వనివారిపై వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నోటిఫికేష‌న్ల విడుద‌ల్లో జాప్యంపై మంత్రి ఆగ్రహం వ్య‌క్తం చేశారు. సిఎం చెప్పినా ఇంకా నోటిఫికేష‌న్లు ఆల‌స్య‌మ‌వుతుండ‌టంపై మంత్రి గంటా తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. సీఎం, తాను త్వ‌రిత‌గ‌తిన‌
అధ్యాప‌క నియామ‌కాలు చేప‌ట్టాల‌ని విసిలకు చెబుతున్నా, ఆల‌స్యం కావ‌డం మంచి సంకేతాలు ఇవ్వ‌ద‌ని మంత్రి గంటా అన్నారు.

జాప్యం ఎందుకు?...

జాప్యం ఎందుకు?...

కొన్ని వ‌ర్శిటీలు ఇప్ప‌టికే నోటిఫికేష‌న్లు ఇవ్వ‌గా ఎక్కువ శాతం వ‌ర్శ‌ిటీలు ఇవ్వ‌క‌పోవ‌డంపై కారాణాలు అడిగారు. గ‌వర్న‌ర్ నామినీ అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్లే జాప్యం జ‌రుగుతోంద‌ని కొంత మంది వైస్ చాన్స‌ల‌ర్లు ఈ సందర్భంగా మంత్రి గంటాకు చెప్పారు. అలాంటి స‌మ‌స్య‌లు ఏవైనా వుంటే త‌న దృష్టికి తీసుకురావాల‌ని, వాటిని వెంట‌నే ప‌రిష్క‌రిస్తామ‌ని మంత్రి గంటా స్ప‌ష్టం చేశారు.

 క్లారిటీ విషయం...

క్లారిటీ విషయం...

టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి సంబంధించి రోస్ట‌ర్ క్లారిఫికేష‌న్ విషయమై సోషియ‌ల్ వెల్ఫేర్ శాఖ‌తో తాను చర్చించి స్పష్టత తీసుకుంటానని మంత్రి గంటా వెల్లడించారు. విశ్వ‌విద్యాల‌యాలు త‌మ సామ‌ర్థ్యాల‌ను పెంచుకొని అక్రిడేష‌న్, ర్యాంకింగ్స్ లో ముందుండాల‌ని, ఆ మేర‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి గంటా అన్నారు.

 మరోసారి సమావేశం...

మరోసారి సమావేశం...

డిసెంబర్ 27న ఇండియ‌న్ ఎక‌నమిక్ అసోసియేష‌న్ ప్రారంభ సమావేశంలో తాను పాల్గోవాల్సి ఉందని, ఆ కార్యక్రమం పూర్తైన తర్వాత అదే రోజు సా.3 గం.ల‌కు ఉన్న‌త విద్యామండ‌లి కార్యాల‌యంలో మరోసారి స‌మావేశ‌మ‌వుదామ‌ని మంత్రి గంటా అన్నారు. ఈ స‌మావేశానికి వీసీలు అంద‌రూ హాజ‌రుకావాల‌ని, అనేక అంశాల‌పై చ‌ర్చించాల్సి ఉందని తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Minister Ganta srinivasrao warned to VC's that notifications should be issued for the teaching posts in universities before January 6th. Education Minister Ganta has conducted a review meeting of all the Universities of the State through the Video Conference from Visakhapatna.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి