వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గేట్-2018 టాపర్‌ని ఏపీ యువత ఆదర్శంగా తీసుకోవాలి: చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

విజయవాడ: గేట్-2018లో ఏపీకి చెందిన భువనచంద్ర ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. సోమవారం సచివాలయంలో పునుకొల్లు భువనచంద్ర తన తల్లిదండ్రులతో సహా సీఎం చంద్రబాబుని కలిశారు.

ఈ సందర్భంగా భువనచంద్రను సత్కరించిన చంద్రబాబు.. అతనికి బుద్దుని విగ్రహాన్ని బహూకరించారు. భువనచంద్రను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని యువత భువనచంద్రను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

 GATE topper Bhuvana Chandra felicitated by chandrababu naidu

సీఎంను కలవడానికి ముందు భువనచంద్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుని కలిశారు. ఈ సందర్భంగా భువనచంద్రను దేవినేని అభినందించారు. జాతీయ స్థాయి గేట్ పరీక్షలో ప్రథమ ర్యాంక్ సాధించడం కృష్ణా జిల్లాకే గర్వకారణమన్నారు.

కాగా, భువనచంద్ర కృష్ణా జిల్లా, బాపులపాడు మండలం తిప్పనగుంట వాసి. మద్రాస్ ఐఐటీలో బీటెక్ పూర్తిచేసిన భువనచంద్ర.. ఆల్ ఇండియా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో ఆల్ ఇండియా గేట్ లో ప్రథమ ర్యాంక్ సాధించాడు.

English summary
Bhuvana Chandra, GATE top ranker in Aero space has felicitated by AP CM Chandrababu Naidu on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X