బిగ్ న్యూస్.. అదానీ కేసులో ఏపీకి లింక్.. ఆ అధికారుల పేర్లు, జగన్ షాక్!
భారతీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానిపై అమెరికాలో కేసు నమోదు కావడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాలలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈ కేసుతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అప్పటి ఏపీ అధికారులతో ఈ లంచాల వ్యవహారం నడిపినట్టుగా సమాచారం.
భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టు కోసం భారీ లంచాలిచ్చిన అదానీ
లంచం మరియు మోసం కేసులో అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ పై కేసు నమోదు చేసిన యూఎస్ బ్రూక్లిన్ లోని ఫెడరల్ కోర్టు గౌతమ్ అదానితో పాటు ఏడుగురిపైన కేసులు నమోదు చేశారు. భారతదేశంలో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకోవడానికి గౌతమ్ అదాని మరో ఏడుగురు తో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్టు అమెరికా ఫెడరల్ కోర్టు పేర్కొంది.

ఏపీతో అదానీ కేసుకు లింకులు
బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం అందించి, నిధులు సమకూర్చేందుకు ప్రయత్నం చేసినట్టు ఆరోపణలు చేస్తుంది. కాగా ఈ ఆరోపణలలో అమెరికా ఇన్వెస్టర్ల నిధులు కూడా ఉండడంతో ఈ కేసులో US దర్యాప్తును ప్రారంభించింది. అయితే తాజాగా ఈ కేసులో ఏపీతో ఉన్న లింకులు బయటకు వచ్చాయి.
ఆ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం 2029 కోట్ల రూపాయల లంచాలు
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తో జరిగిన ఒప్పందం స్కామ్ కేసులో వేర్వేరు రాష్ట్రాల ప్రభుత్వ అధికారులకు 2029 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా 2021లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు అధికారులకు గౌతమ్ అదాని లంచాలు ఇచ్చారని అభియోగాలు ఉన్నాయి. వేలకోట్లు ఈ సందర్భంగా చేతులు మారినట్టు యూఎస్ కోర్టు అభియోగం.
జగన్ ప్రభుత్వ హయాంలో అధికారులకు 1750 కోట్ల రూపాయల లంచాలు
విదేశీ అధికారులతో ఏపీలోనే గౌతమ్ అదాని భేటీ జరిగిందని, 2021 ఆగస్టు 7, సెప్టెంబర్ 12, నవంబర్ 20తేదీలలో గౌతమ్ అదాని భేటీ అయినట్టు ఈ క్రమంలోనే ప్రభుత్వ అధికారులకు 2029 కోట్లు లంచం ఇవ్వజూపారని తాజా కేసులో వస్తున్న ఆరోపణలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒప్పందాల కోసం జగన్ ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులకు 228మిలియన్ డాలర్లు, దాదాపు రూ.1750కోట్ల లంచాలను ఇచ్చినట్టు బ్రూక్లిన్ కోర్టులో చేసిన ఆరోపణలలో ఉంది.
ఏపీ ప్రభుత్వంలోని కీలక అధికారి ప్రధాన పాత్ర
2019- 2024 మధ్య ఈ మొత్తం కుంభకోణం చోటు చేసుకున్నట్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ లోని విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ మేరకు డిసెంబర్ 1 2021న అదాని సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు పేర్కొంది. మొత్తం 7000 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలు డీల్ కుదరడానికి పెద్ద మొత్తంలో ఇచ్చిన లంచాలే కారణమని పేర్కొంది. ఇక ఈ ఒప్పందాలలో 2019 నుండి 2024 వరకు పనిచేసిన ఏపీ ప్రభుత్వంలోని కీలక అధికారి ప్రధాన పాత్ర పోషించినట్టుగా ఆరోపణలు రావడం ఏపీలో రాజకీయంగా చర్చకు దారి తీసింది.












Click it and Unblock the Notifications