గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంపీ రఘురామకృష్ణంరాజును కొడితేనే దిక్కులేదు.. నువ్వెంత??

|
Google Oneindia TeluguNews

ఏపీలో అధికార పార్టీకి, ప్రభుత్వానికి వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్న 'ఘ‌ర్ష‌ణ' యూట్యూబ్ ఛానెల్ నిర్వాహ‌కుడు బొబ్బూరి వెంగ‌ళ‌రావు(34)ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగిస్తున్నార‌ని, ప్ర‌జ‌ల్లో వ‌ర్గ వైష‌మ్యాల‌ను ప్రేరేపిస్తున్నారంటూ ఐపీసీలోని సెక్షన్‌ 506, 386, 120బీ, 153ఏ, 505 (2), ఐటీ చట్టంలోని 67ఏ సెక్షన్‌ కింద కేసులు నమోదు చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న వెంగ‌ళ‌రావును కోదాడ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం గుంటూరులోని సీఐడీ రీజ‌న‌ల్ కార్యాల‌యానికి తీసుకువ‌చ్చారు.

దుస్తులు విప్పి కొట్టారని చెప్పిన వెంగళరావు

దుస్తులు విప్పి కొట్టారని చెప్పిన వెంగళరావు


సీఐడీ అధికారులు వెంగ‌ళ‌రావును గుంటూరు ఆరో అడిష‌న‌ల్ జ‌డ్జి శృతి ఎదుట హాజరుపరిచారు. దుస్తులు విప్పి తనను తీవ్రంగా కొట్టార‌ని, ఈ విష‌యాన్ని మీతో చెబితే నా రెండు సంవ‌త్స‌రాల కుమారుణ్ని చంపేస్తామంటూ బెదిరించార‌ని వెంగ‌ళ‌రావు న్యాయ‌మూర్తి ఎదుట క‌న్నీరు పెట్టుకున్నారు. విచార‌ణ పేరుతో త‌న‌ను చిత్ర‌హింస‌లు పెట్టారంటూ వివ‌రించ‌గా ఆమె వాంగ్మూలాన్ని న‌మోదు చేసుకున్నారు.

ఎంపీని కొడితేనే దిక్కులేదు..

ఎంపీని కొడితేనే దిక్కులేదు..


ఎంపీ రఘురామకృష్ణంరాజును కొడితేనే దిక్కులేదు.. నిన్ను కొడితే కోర్టులు ఏం చేయగలవ‌ని, నిన్ను కొట్టిన విషయం న్యాయమూర్తితో చెబితే బయటకు వచ్చిన త‌ర్వాత చంపేసినా కోర్టులు ఏమీ చేయ‌లేవ‌న్నార‌ని, వారు చెప్పిన‌ట్లు వింటే బ‌తుకుతాన‌ని చెప్పార‌ని వెంగ‌ళ‌రావు జ‌డ్జికి వివ‌రించారు. త‌న‌తో ఓ కాగితంపై సంత‌కాలు చేయించుకున్నార‌ని వెల్లడించారు. కావాలంటే వైసీపీకి అనుకూలంగా వీడియోలు చేసుకోమ‌న్నార‌ని, లేదంటే న‌న్ను, నా కుటుంబాన్ని చంపేస్తామ‌న్నారంటూ చెప్పారు.

కొట్టినట్లు చెబితే బెయిల్ రాదన్నారు

కొట్టినట్లు చెబితే బెయిల్ రాదన్నారు


సీఐడీ అధికారులు కొట్టిన‌ట్లు న్యాయ‌మూర్తితో చెబితే బెయిల్ రాద‌న్నార‌ని, కొట్ట‌లేద‌ని చెబితేనే బెయిల్ వ‌స్తుంద‌న్నార‌ని తెలిపారు. వెంగ‌ళ‌రావుకు ప్రాథ‌మిక వైద్య‌ప‌రీక్ష‌లు జ‌రిపించి జ‌డ్జి ఎదుట సీఐడీ అధికారులు హాజ‌రు ప‌రిచారు. పోలీసులు కొట్ట‌డంవ‌ల్ల గాయాల‌య్యాయంటూ ఆయ‌న వాటిని చూపించారు. దీంతో తిరిగి మ‌ళ్లీ వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని జ‌డ్జి ఆదేశించారు. మేజిస్ట్రేట్‌ ఆదేశాలతో వెంగళరావును గుంటూరు ప్ర‌భుత్వాస్ప‌త్రికి వైద్య‌ప‌రీక్ష‌ల నిమిత్తం త‌ర‌లించారు. వైద్య‌ప‌రీక్ష‌లైన త‌ర్వాత నివేదిక‌ను సీల్డ్ క‌వ‌ర్‌లో మెజిస్ట్రేట్‌కు అంద‌జేయ‌నున్నారు.

English summary
The CID officials have arrested Bobburi Vengala Rao (34), the administrator of the 'Gharshana' YouTube channel, who has been posting posts on social media against the ruling party and the government in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X