Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్‌కు దెబ్బపై దెబ్బ: సైకిలెక్కిన ఎమ్మెల్యే, క్యూలో.. టిడిపిలో పోతులకు రివర్స్

విజయవాడ: ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి బుధవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన గత సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి తరఫున గెలుపొందారు. ఈయన చేరికతో టిడిపిలోకి వైసిపి ప్రజాప్రతినిధుల చేరిక 18కి చేరింది.

ఆయనతో పాటు పలువురు జెడ్పీటీసీలు, చైర్మన్, ఎంపీటీసీలు తదితరులు సైకిల్ ఎక్కారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. పార్టీలో చేరే వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. గిద్దలూరు నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు.

వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటానని చెప్పారు. అశోక్ రెడ్డి కోరినట్లు నియోజకవర్గం అంతటా పైపు లైన్లతో నీరు అందిస్తామన్నారు. అమరావతి - బెంగళూరు ఎక్సుప్రెస్ హైవే మధ్యలో గిద్దలూరు వస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే చాలా అడిగారని, వాటిని నెరవేరుస్తామన్నారు.

కాగా, రాజ్యసభ ఎన్నికలలో నాలుగో అభ్యర్థిని నిలబెట్టకుండా జగన్‌కు ఊరట కల్పించిన మరుసటి నాడే ఆయనకు సొంత ఎమ్మెల్యేలు షాకిచ్చారు. మరికొందరు వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.

టిడిపిలోకి కందుకూరు ఎమ్మెల్యే

జగన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే 18 మంది ఎమ్మెల్యేలు షాకిచ్చారు. తాజాగా నేడు మరో ఎమ్మెల్యే జగన్‌కు షాకివ్వనున్నారు. వెరసి జగన్ పార్టీ బలం నిన్ననే 50 మార్కు కంటే కిందకు చేరుకుంటుంది. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం నుంచి గడచిన ఎన్నికల్లో వైసీపీ టికెట్ పైన బరిలోకి దిగి విజయం సాధించిన ఎమ్మెల్యే పోతుల రామారావు నేడు టీడీపీలో చేరనున్నారు.

తన అనుచరవర్గంతో కలిసి నేడు విజయవాడకు వెళ్లనున్న రామారావు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. రామారావు దూరం కానున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేల బలం 48కి పడిపోనుంది.

Giddalur YSRCP MLA Ashok Reddy joins TDP

కందుకూరు ఎమ్మెల్యే చేరికపై ఆసక్తికరం

కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యేగా వైసీపీ టికెట్ పై గెలిచిన భూమా నాగిరెడ్డితో మొదలైన చేరికలు అన్నింటిలో నిరసన గళాలు వినిపించాయి. తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని పార్టీలోకి ఎలా తీసుకుంటారంటూ ఆయా జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల టీడీపీ ఇంచార్జులు పార్టీని నిలదీశారు.

కందుకూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పోతుల రామారావు విషయంలో మాత్రం నిరసన గళం వినిపించడం లేదట. ఈరోజు తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరుతున్న ఆయనకు చేరికకు ముందే అరుదైన స్వాగతం లభించింది.

నియోజకవర్గానికి చెందిన టీడీపీ శ్రేణులు నిన్న పోతుల ఇంటి వద్దకెళ్లి మరీ సాదర స్వాగతం పలికారు. ఇక నియోజకవర్గ టీడీపీ ఇంచార్జిగా ఉన్న దివి శివరాం బుధవారం విజయవాడలో పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. పార్టీలో కొత్తగా చేరుతున్న వారితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+