జగన్! క్షోబే మిగిల్చాడు, ఎస్సీ, ఎస్టీ కేసులు పెడ్తా: గిడ్డి ఈశ్వరి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతానని పాడేరు ఎమ్మెల్యే, టీడీపీ నేత గిడ్డి ఈశ్వరి అన్నారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతానని పాడేరు ఎమ్మెల్యే, టీడీపీ నేత గిడ్డి ఈశ్వరి అన్నారు. అంతేగాక, సాక్షి పత్రిక, ఛానల్‌పై చట్టపరంగా ముందుకు వెళ్తానని చెప్పారు.
జగన్మోహన్ రెడ్డికి గిరిజనుల అభివృద్ధి గిట్టదని గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. పార్టీ కోసం మూడున్నరేళ్లు కష్టపడితే జగన్ తనకు మానసిక క్షోభ మిగిల్చాడని ఆమె దుయ్యబట్టారు.

గిరిజన మహిళ అయిన తనపై కుట్రలు పన్నుతున్నారని గిడ్డి ఈశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. జగన్.. సీఎం పదవి కోసమే పార్టీ పెట్టారని ఆరోపించారు. గిరిజనుల అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. ఈశ్శరి రెండ్రోజుల క్రితమే టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications