ప్రేమ విఫలం?: కాలేజీ భవనంపై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
గుంటూరు: జిల్లా చేబ్రోలు మండల పరిధిలోని వడ్లమూడి విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో విషాద ఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చేబ్రోలు ఎస్సై ఆరోగ్యరాజు తెలిపిన వివరాల ప్రకారం.. కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న ప్రకాశం జిల్లా దర్శికి చెందిన హరిణి(19) అనే విద్యార్థిని కళాశాల భవనం నుంచి దూకింది. తీవ్ర గాయాలైన ఆమెను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

ప్రేమ విఫలం కావడం వల్లే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడిందని తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రాళ్లతో కొట్టి దారుణంగా హత్య
అనంతపురం జిల్లాలో గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా కొట్టి చంపారు. ధర్మవరం పట్టణంలోని మార్కెట్ యార్డ్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సుమారు 40 ఏళ్ల వయస్సున్న అతని తలపై బండరాళ్లతో కొట్టడం వల్ల మృతిచెందినట్లు తెలుస్తుంది.
ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలతో పాటు ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
బస్సు-ఆయిల్ ట్యాంకర్ ఢీ: పలువురికి గాయాలు
తూర్పుగోదావరిజిల్లా రావులపాలెం మండలం ఈతకోట వద్ద జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు- ఆయిల్‌ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరుడ్రైవర్లు సహా పలువురు ప్రయాణికులుకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను రావులపాలెం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications