పగోలో సజీవదహనం, కర్నూల్లో ఆట కట్టించింది

Girl burnt in National Highway
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలో దారుణం జరిగింది. ఓ బాలికను దుండగులు జాతీయ రహదారిపై పట్టపగలు సజీవ దహనం చేశారు. బాలిక శరీరం చాలా వరకు కాలిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, ఘటన పైన కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.

మిలీషియా సభ్యుల అరెస్ట్‌

తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలకు సహకరిస్తున్న 13 మంది మిలీషియా సభ్యులను అరెస్టు చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గురువారం తెలిపారు. వారి నుంచి నాటుతుపాకీలు, ల్యాండ్‌మైన్‌లు పెట్టేందుకు ఉపయోగించే రెండు డంప్‌లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు.

కల్తీ కల్లు తాగి అస్వస్థత

అనంతపురం జిల్లా లేపాక్షి మండలం చినగానిపల్లెలో కల్తీ కల్లు తాగి పదహారు మంది అస్వస్థత బారిన పడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

యువకుడి దారుణ హత్య

గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెనుమూడి వద్ద యువకుడు దారుణ హత్యగు కురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు యువకుడిని హత్య చేసి తల ఎత్తుకెళ్లారు. రేపల్లె పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

ఆకతాయిల ఆటకట్టించిన యువతి

కర్నూలులో ఓ యువతి ఆకతాయిల ఆట కట్టించింది. కనిపించిన ప్రతిసారి తనను వేధిస్తున్నా భరిస్తూ వస్తున్న ఆ యువతి శుక్రవారం మాత్రం అపర కాళిగా మారారు. శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆ యువతిని ఎప్పటిలాగే ఇద్దరు ఆకతాయిలు వేధించడం ప్రారంభించారు.

దీంతో ఒక్కసారిగా ధైర్యం కూడదీసుకున్న ఆ యువతి, ఇద్దరు ఆకతాయిల చెంపను ఛెళ్లుమనిపించింది. అంతటితో ఆగని ఆ యువతి వారిని కదలకుండా పట్టేసి, పోలీసులకు అప్పగించింది. దీంతో పోలీసులు సదరు ఆకతాయిలను పోలీస్ స్టేషన్‌కు తరలించి వారిపై కేసు నమోదు చేశారు. ఆమె ఆటోలో వెళ్తున్నప్పుడు యువకులు బైక్ పైన ఆమెను ఫాలో అయ్యారు. అప్పుడు వారికి ఆమె బుద్ది చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+