ప్రియుడు మోసం చేశాడని... ప్రియురాలు ఆత్మహత్య
తనను ప్రేమించి పెళ్లిచేసుకుంటానాని నమ్మబలికి ప్రియుడు మోసం చేయడంతో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పాత గుంటూరు లో కలకలం రేపుతోంది.
గుంటూరు: తనను ప్రేమించి పెళ్లిచేసుకుంటానాని నమ్మబలికి ప్రియుడు మోసం చేయడంతో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పాత గుంటూరు లో కలకలం రేపుతోంది. పాత గుంటూరు చెందిన బత్తుల నందిని 18 అనే యువతి గుంటూరు లోని ఓ మెట్రో ఆసుపత్రిలో గత కొంత కాలం నుంచి పని చేస్తూ జీవనం సాగిస్తోంది.
ఈ నేపధ్యంలో అదే ఆసుపత్రిలో మెడికల్ లో పనిచేస్తున్న బిలాల్ అనే యువకుడితో పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో గత కొంత కాలంగా ఇద్దరు ఇష్టపడి ఒకరినొకరు ప్రేమించుకుంటు సహ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఈవిషయం తెలుసుకున్న నందిని తల్లిదండ్రులు నందిని ని నిలదీయగా గత కొంతకాలంగా తాము ఇద్దరం ప్రేమించుకుంటు న్నామని త్వరలో పెళ్లి చేసుకుంటున్నామని నందిని తెలిపింది .

అనంతరం నందిని ఈ రోజు బిలాల్ వద్దకు వెళ్లి మన ప్రేమ వ్యవహారం మా ఇంట్లో తెలిసింది నన్ను పెళ్లి చేసుకో అని బిలాల్ ని నిలదీయడంతో ఒక్క సరిగా కంగుతిన్న బిలాల్ అసలు నువ్ ఎవరో నాకు తెలియదు నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి అని నందినిని ప్రశించగా తీవ్ర మనోవేదనకు గురైన నందిని వెంటనే పాత గుంటూరు ఆంజనేయస్వామి గుడి సమీపంలో ని తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడగా ఈ విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా నందిని అప్పటికే మృతి చెందింది.
ఈ విషయం తెలుసుకున్న పాత గుంటూరు సీఐ బాల మురళి క్రిష్ణ మృతురాలు నందిని ఆత్మహత్య గల కారణాలపై దర్యాప్తు చేసి విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications