రేప్ జరిగిందని వస్తే, అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు

భార్య ఆత్మహత్య చేసుకోవడంతో భర్త కూడా మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన నాగరాజుకు, ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన మాధవితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది.
వారికి ఇద్దరు సంతానం ఉంది. వారు పర్చూరులో ఉంటున్నారు. నాగరాజు ఒక హోటల్లో వంట మాస్టారుగా పని చేస్తున్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దాంతో మాధవి ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది.
భార్య మృతిని భర్త తట్టుకోలేకపోయాడు. నాగరాజు కూడా స్థానిక ప్రకాశ్ నగర్ ఆంధ్రా బ్యాంకు సమీపంలోని రైల్వే ట్రాకు పైన మధ్యాహ్నం నుండి నల్లపాడు వెళ్లే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో వారి పిల్లలు అనాథలయ్యారు.












Click it and Unblock the Notifications