శంషాబాద్ విమానాశ్రయంలో ఏపీ యువతి అదృశ్యం
హైదరాబాద్: విశాఖపట్నంకు చెందిన ఓ విద్యార్థిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కనిపించకుండాపోయింది. విశాఖలో నేవీ ఆఫీసర్‌గా పనిచేసే అరవింద్ శర్మ కుమార్తె కైరవి(17) హైదరాబాద్‌లో ఇంటర్ చదువుకుంటోంది.
ఆమె గురువారం మధ్యాహ్నం విశాఖ నుంచి విమానంలో శంషాబాద్‌కు చేరుకుంది. కైరవి శంషాబాద్ నుంచి పుణేకు వెళ్లాల్సి ఉంది. అయితే పుణేకు చేరుకోలేదని తెలిసిన ఆమె తండ్రి శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విమానాశ్రయంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆమె ఫోన్ స్విఛ్చాఫ్ అయ్యే ముందు ఏ ప్రాంతంలో ఉన్నారో గుర్తించేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు.












Click it and Unblock the Notifications