టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య: పరీక్షల భయంతోనే..!*
ఏలూరు: పదో తరగతి పబ్లిక్ పరీక్షల భయంతో ఓ విద్యార్థిని శనివారం బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనతో ఆమె తల్లిదండ్రులు హతాశులయ్యారు. తీవ్రంగా రోదించారు.
రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరు దక్షణపు వీధికి చెందిన కాదా హరిత(15) వన్‌టౌన్ ప్రాంతంలోని కస్తూరిబా నగరపాలక బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆమె తండ్రి కాదా అప్పారావు వండ్రంగి. తల్లి సత్యవతి ఇళ్లలో వంటపనిచేస్తారు.

వీరు మొదటి కుమార్తెకు వివాహం చేసేశారు. హరిత రెండో కుమార్తె. చిన్ననాటి నుంచి ఆమెను గారాబంగా పెంచారు.హరిత మొదటి నుంచి చదువులో వెనుకబడి ఉంటోంది.












Click it and Unblock the Notifications