యువకుడి గొంతు కోసిన యువతి: ప్రేమించట్లేదని..

ప్రైవేట్ ఉద్యోగం చేసుకునే రాము ఇది తప్పంటూ ప్రేమను తిరస్కరించాడు. అతడికి ఈ నెల 14వ తేదీిన తన మేనకోడలితో పెళ్లి అయింది. అయినా రమణి మాత్రం అతడిని ప్రేమించాలనే అడుగుతూనే ఉంది. తాజాగా సోమవారం సాయంత్రం నీతో మాట్లాడాలి, పని ఉందంటూ ఆమె అతన్ని వేదాద్రి వద్దకు పిలిపించింది.
వేదాద్రి వద్దకు వచ్చిన రాముపై రమణి దాడి చేసింది. అక్కడి నుంచి నేరుగా ఆస్పత్రికి వచ్చిన రాము చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లిపోయాడు. ఏం జరిగిందని ఇంట్లోవాళ్లు అడిగినా అతను ఏమీ చెప్పలేదు. అయితే, కటుంబ సభ్యులు పట్టుబట్టడంతో విషయం చెప్పాడు.
రామును కుటుంబ సభ్యులు విజయవాడ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications