వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలికల హాస్టల్లో కలకలం: రాత్రిపూట జుట్టు కత్తిరింపు.. ఎవరై ఉంటారు?

చున్నీలు ముఖంపై కట్టుకుని ఉన్న ఇద్దరు అమ్మాయిలు వచ్చి ఈ జుట్టు కత్తిరించి ఉంటారని కొంతమంది విద్యార్థినులు చెబుతున్నందునా.. సీనియర్లే ర్యాగింగ్ చేసి ఉంటారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

|
Google Oneindia TeluguNews

ఏలూరు: నిన్నటిదాకా 'మహిళల జుట్టు కత్తిరింపు' ఉదంతాలు ఉత్తరభారతానికే పరిమితం కాగా.. ఇప్పుడు దక్షిణ భారతానికి అది పాకినట్లుంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం గోడి ప్రభుత్వ గురుకుల హాస్టల్లో ఇద్దరు విద్యార్థినుల జుట్టును గుర్తు తెలియని వ్యక్తులు కత్తిరించారు.

శనివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన హాస్టల్ బాలికలను భయభ్రాంతులకు గురిచేసింది. చున్నీలు ముఖంపై కట్టుకుని ఉన్న ఇద్దరు అమ్మాయిలు వచ్చి ఈ జుట్టు కత్తిరించి ఉంటారని కొంతమంది విద్యార్థినులు చెబుతున్నందునా.. సీనియర్లే ర్యాగింగ్ చేసి ఉంటారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

విద్యార్థినుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి 11.30 గంటల వరకు నైట్‌వాచ్‌మన్‌ ఉందని, చదువుకుని వెళ్లి పడుకున్నాక ఎవరో తమ జుట్టు కత్తిరించారని వారు వాపోతున్నారు. ఆదివారం ఉదయం స్నానాలకు వెళుతున్నప్పుడు ముడి వేసుకుంటుండగా తమ జుట్టు కత్తిరించి ఉన్నట్టు గమనించామని బాధిత విద్యార్థినులు తెలిపారు.

girls hair chopped off in welfare hostel east godavari

9-10ఏళ్ల వయసున్న నలుగురు జూనియర్ విద్యార్థినుల జుట్టును కత్తిరించినట్లు హాస్టల్ యాజమాన్యం గుర్తించింది. వీరిలో ఒకరి జుట్టును బకెట్‌లో పడేయగా, మిగిలిన ముగ్గురి జుట్టు కిటికీలోంచి బాత్‌రూమ్‌ వైపు పడేశారని బాధిత విద్యార్థినులు తెలిపారు.

హాస్టల్ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ మాత్రం దీనిపై స్పందించారు. ప్రతిరోజు రాత్రి 9 వరకు స్టడీ అవర్స్ ఉంటాయని, 7 గం. మెయిన్‌ గేటు మూసివేస్తామని, కాబట్టి బయటి వ్యక్తులు లోపలికి వచ్చే అవకాశం లేదని అన్నారు. రెండు రోజుల్లో దీనిపై పూర్తి వివరాలు రాబడుతామన్నారు.

English summary
Unknown persons are entered into a welfare hostel and chopped off girl's hair on Saturday night in East Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X