Video: ఆకలి తీరాక ‘పెద్దపులి’ వింత చేష్టలు.. మీరూ చూడండి

దట్టమైన అడవిలో ఆదివారం రాత్రి చీకట్లు ముసురుకున్న వేళ.. అంతా నిశ్శబ్దంగా ఉంది. కానీ, ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఒక భయంకరమైన గర్జన వినిపించింది. పోలవరం జిల్లా దేవీపట్నం మండల సరిహద్దు ప్రాంతమైన నేలకోట అటవీ పరిసరాల్లో చాటుగా పొంచివున్న ఆకలిగొన్న ఒక పెద్దపులి, క్షణాల వ్యవధిలో వేగాన్ని పుంజుకుని అడవి పందిపై విరుచుకుపడింది. ఊహించని ఈ మెరుపు దాడిలో పులి తన పంజాతో అడవి పందిని అక్కడికక్కడే హతమార్చింది. ఈ ఒళ్ళు గగుర్పొడిచే లైవ్ వేట ఉదంతాన్ని అటవీ శాఖ సబ్ డీఎఫ్‌వో సుబ్బారెడ్డి అధికారికంగా ధృవీకరించారు.

అయితే, అసలు సంచలనం ఇక్కడే మొదలైంది. అడవి పందిని వేటాడి చంపిన అనంతరం, ఆ పెద్దపులి చేసిన వింత చేష్టలు అటవీ శాఖ నిఘా కోసం ఏర్పాటు చేసిన డ్రోన్ కెమెరాలో రికార్డయ్యాయి. చనిపోయిన ఆ అడవి పంది మృతదేహంతో పులి కాసేపు వింతగా ఆటలాడుతూ కనిపించింది. అడవిలో పులి సహజ సిద్ధమైన వేట సాగించడం.. ఆపై రికార్డైన ఈ అరుదైన, భీతిగొలిపే దృశ్యాలు ఇప్పుడు అటవీ వర్గాల్లోనే కాకుండా సామాజిక మాధ్యమాల్లోనూ తీవ్ర క్యూరియాసిటీని రేకెత్తిస్తున్నాయి.

Tiger Hunts Wild Boar In Polavaram District As Drone Camera Records Spine Chilling Video Footage
పోలవరం ప్రాజెక్ట్ పరిసరాల్లో భయం భయం!
పోలవరం ప్రాజెక్ట్ పరిసరాల్లో భయం భయం!

రూట్ మార్చిన 'రాయల్ బెంగాల్ టైగర్'.. తూర్పుగోదావరి వైపు పయనం!

నేలకోట అడవిలో ఆకలి తీర్చుకున్న ఈ పెద్దపులి అక్కడితో ఆగలేదు. రాత్రికి రాత్రే తన స్థానాన్ని మార్చుకుంటూ తూర్పుగోదావరి జిల్లా అటవీ సరిహద్దుల వైపు పయనించింది. సోమవారం ఉదయం పులి మెడకున్న 'రేడియో కాలర్' నుంచి అందిన సిగ్నల్స్ ఆధారంగా అధికారులు దాని తాజా లొకేషన్‌ను ట్రాక్ చేశారు. ప్రస్తుతం ఈ క్రూర మృగం ధరణికోట సమీపంలోని రామవరపు చెరువు ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అటవీ శాఖ బృందాలు గుర్తించాయి. క్షణక్షణం మారుతున్న పులి అడుగులు అటవీ అధికారులను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్నాయి.

Viral Video: పీక్కు తింటున్న పెద్దపులి.. అర్ధరాత్రి వేట!
Viral Video: పీక్కు తింటున్న పెద్దపులి.. అర్ధరాత్రి వేట!

అటవీ గ్రామాల్లో వణుకు.. ఒంటరిగా వెళ్తే ముప్పే!

పెద్దపులి ఉనికితో పరిసర గ్రామాల ప్రజలు ఇప్పుడు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు. పులి కదలికలను ట్రాక్ చేయడానికి అటవీ శాఖ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. అడవి పందిని వేటాడి పూర్తి ఫామ్‌లోకి వచ్చిన ఈ పులి ఎప్పుడు, ఎటువైపు నుంచి దాడి చేస్తుందో ఊహించడం కష్టమని అధికారులు హెచ్చరిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు, ముఖ్యంగా రైతులు, పశువుల కాపరులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఒంటరిగా అటవీ ప్రాంతాల్లోకి వెళ్లరాదని, తీవ్ర అప్రమత్తత పాటించాలని అధికారులు హై అలర్ట్ జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+