Cockroach Janta Party: ఇండియా కూటమి ముందు కాక్రోచ్ పార్టీ కీలక డిమాండ్లు..!
దేశంలో విద్యార్ధులు ఎదుర్కొంటున్న పోటీ పరీక్షల అక్రమాల విషయంలో ఇప్పటికే జాతీయ స్ధాయిలో ఆన్ లైన్ తో వీధి పోరాటాలు కూడా చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party).. ఇప్పుడు విపక్ష ఇండియా కూటమిని కూడా కలిసి రావాలని కోరుతోంది. ఇప్పటితే తాము ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రెండు రోజుల క్రితం నిర్వహించిన ఆందోళన సక్సెస్ కావడంతో తదుపరి పోరాటాలపై ఫోకస్ చేస్తున్న బొద్దింకల పార్టీ.. ఇవాళ ఇండియా కూటమి (India Bloc) భేటీ జరుగుతున్న వేళ కీలక డిమాండ్లు వారి ముందు పెట్టింది.
ఈ ఏడాది జాతీయ టెస్టింగ్ ఏజెన్సీతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ సంస్ధలు నిర్వహించిన పోటీ పరీక్షలు, సాధారణ పరీక్షల్లో సైతం అక్రమాలు బయటపడ్డాయి. వీటిలో నీట్ తో పాటు సీబీఎస్ఈ, ఎస్ఎస్ఎస్సీ పరీక్షలు కూడా ఉన్నాయి. వీటి వల్ల దాదాపు 50 లక్షల మంది విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ గట్టిగా కోరుతోంది. అయినా కేంద్రం వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు.

इंडिया गठबंधन की बैठक के बाद 2:30 बजे प्रेस कॉन्फ्रेंस करेंगे,
— Cockroach Janta Party (@CJP_for_India) June 8, 2026
मैं इंडिया गठबंधन से मांग करता हूं कि वह युवाओं के मुद्दे पर जरूर बोले,
पेपर में हो रहे धाधली जैसे NEET,CBSE,SSC और UPSSSC पर जरूर बोले,
युवाओं के भविष्य के लिए सरकार से सवाल जरूर पूछे।
ఈ నేపథ్యంలో ఇవాళ జరుగుతున్న ఇండియా కూటమి తర్వాత మరోసారి ప్రెస్ మీట్ పెడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ.. అందకు ముందే ఎక్స్ లో విపక్షాల ముందు తమ డిమాండ్లు ఉంచింది. ఇందులో ఇండియా కూటమి యువత సమస్యలపై మాట్లాడాలని, నీట్, సీబీఎస్ఈ, ఎస్ఎస్సీ, యూపీఎస్ఎస్సీ వంటి పరీక్షలలో జరుగుతున్న రిగ్గింగ్‌పై మాట్లాడాలని, యువత భవిష్యత్తు కోసం ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రశ్నించాలని డిమాండ్ చేసింది. కాక్రోచ్ పార్టీ డిమాండ్ పై ఇండియా కూటమి ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.














Click it and Unblock the Notifications