తిరుమల శ్రీవారికి గ్లోబల్ బ్రాండ్..విదేశాలలో శ్రీవారి ఆలయాలు.. తగ్గేదేలే!

కలియుగ ప్రత్యక్ష దైవం, శేషాద్రి శిఖరాన కొలువైన స్వామి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయితే శ్రీవారి దివ్య వైభవాన్ని ప్రపంచ నలుమూలలకు విస్తరింప చేయాలని టీటీడీ భారీ ప్రణాళికను రూపొందించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచనలతో టిటిడి పాలకమండలి అంతర్జాతీయంగా శ్రీవారి ఖ్యాతిని విస్తరింపజేసే పని మొదలు పెట్టింది.

అంతర్జాతీయంగా శ్రీవారి ఆలయాల విస్తరణ
అంతర్జాతీయంగా శ్రీవారి ఆలయాలను విస్తరించేందుకు, విదేశాలలో ఆలయ నిర్మాణానికి, నిర్వహణకు సంబంధించిన చట్టపరమైన అంశాలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక నిపుణుల కమిటీని నియమించింది. త్వరలోనే పూర్తిస్థాయి కార్యాచరణతో వివిధ దేశాలలో తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. శ్రీవారి ఆలయాల నిర్మాణానికి విదేశాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీగా విన్నపాలు అందుతున్నాయి.

global brand for tirumala srivaru Temples of Lord Venkateswara in foreign countries

శ్రీవారి ఆలయాలను నిర్వహించడానికి టీటీడీ నమూనాలు
ఇప్పటికే జర్మనీ నుంచి మూడు, యూకే నుంచి 4 ప్రతిపాదనలు రాగా, ఆస్ట్రేలియా , శ్రీలంక, నెదర్లాండ్స్, స్వీడన్, స్విట్జర్లాండ్, పోలాండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్ తో సహా పలు ఇతర దేశాల నుండి కూడా అభ్యర్థనలు వస్తున్నాయి. ఇక ఇదే క్రమంలో విదేశాలలో శ్రీవారి ఆలయాలను నిర్వహించడానికి టీటీడీ మూడు నమూనాలను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

మూడు నమూనాలను సిద్ధం చేసిన టీటీడీ
స్వామి వారి బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినకుండా గ్లోబల్ గా ఏ ప్లాన్ తో ముందుకు వెళితే బాగుంటుంది అన్న దానిపైన టిటిడి పరిశీలన చేస్తోంది. మొదటిది టిటిడి యాజమాన్యంలో భూమి కొనుగోలు నుండి నిర్వహణ వరకు అన్ని చూసుకోవడం. రెండవది స్థానిక హిందూ సంస్థలకు, ఆధ్యాత్మిక, సాంకేతిక సహకారాన్ని అందించి నిర్వహించేలా చూడడం, మూడవది తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక కమిటీల సంయుక్త నిధుల నిర్వహణ.

మొదటి నమూనాలోనే ఆలయాల నిర్మాణాలు
అయితే ఈ మూడింటిలో మొదటి విధానమే మంచిదని, చట్టపరంగా సురక్షితమైనది కూడా అని నిపుణుల కమిటీ అభిప్రాయపడుతోంది. టిటిడి బ్రాండ్ ఇమేజ్, పూజా విధానాల స్వచ్ఛత దృష్ట్యా మొదటి నమూనానే ఉత్తమమైనదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. విదేశాలలో నిర్మించే ఆలయాలలో భారతీయ శిల్పకళ ఉట్టిపడేలా తిరుమల తరహాలోనే ఆగమశాస్త్ర పూజలు జరిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులను భారతదేశం నుంచి ప్రత్యేకంగా శిల్పులను కూడా పంపించనుంది. ఇది సాంప్రదాయ పరిరక్షణకు దోహదం చేస్తుంది అన్న అభిప్రాయం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+