రుషికొండ ప్యాలెస్ ను పిచ్చాసుపత్రిగా మార్చాలి: గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు
గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రుషికొండ ప్యాలెస్ ను మానసిక వైద్యశాలగా మార్చాలని సలహా ఇచ్చారు. ప్రజాధనంతో నిర్మించిన రుషికొండ భవనాన్ని పిచ్చాసుపత్రిగా మార్చాలని సలహా ఇచ్చారు. క్షత్రియ సేవాసమితి ఆధ్వర్యంలో ఇవాళ విశాఖలో ఆయనకు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అశోక్‌గజపతిరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
విశాఖలో ప్రజాధనంతో నిర్మించిన రుషికొండ ప్యాలెస్ పెచ్చులు ఊడిపోయాయని తెలిసిందని.. అదే రూ.600 కోట్లు ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయ్యేదని అన్నారు. ఈ భవనాన్ని ఏం చేయాలని ప్రభుత్వం ప్రజలను అడుగుతోందని.. అయితే దానిని పిచ్చి ఆసుపత్రి చేస్తే మంచిదని తన ఉచిత సలహా అని చెప్పుకొచ్చారు. అలా అయితే కనీసం దానిని కట్టిన దుర్మార్గులకి ఆ సముద్ర గాలి తగులుతుంది. ఆ భవనాల ద్వారా ఎలాంటి ఆదాయం రాదు.. అని అశోక్ గజపతిరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనాన్ని ప్రజా హితం కోసమే వాడాలన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు వదిలిన వారికి మనమేం విలువ ఇస్తున్నామో ఆలోచించాలని తెలిపారు.
ఏపీలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన రుషికొండ ప్యాలెస్ పై గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. నిరుపయోగంగా ఉన్న ఆ భవనాన్ని మెంటల్ ఆసుపత్రిగా మార్చాలని సలహా ఇచ్చారు. ఈ భవనంలో గోడల పెచ్చులు ఊడిపోయినట్లు తాను విన్నానని ఆయన తెలిపారు. రుషికొండ ప్యాలెస్ ను ఏం చేస్తే బాగుంటుందో ప్రజలే తమ అభిప్రాయాలను చెప్పాలని ఆయన కోరారు. అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

గోవా గవర్నర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అశోక్ గజపతిరాజును విశాఖపట్నంలో క్షత్రియ సేవా సమితి తాజాగా ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనాన్ని ప్రజా హితం కోసమే వినియోగించాలని అన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు వదిలిన వారికి మనమేం విలువ ఇస్తున్నామో ఆలోచించాలని సూచించారు.












Click it and Unblock the Notifications