వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోదావరికి వరద ఉధృతి: పోలవరం, ధవళేశ్వరం గేట్ల ఎత్తివేత: పలు గ్రామాలకు రాకపోకలు బంద్

|
Google Oneindia TeluguNews

అమలాపురం: నైరుతి రుతు పవనాలకు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్రోణి తోడు కావడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ప్రత్యేకించి ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణల్లో గోదావరి నదీ తీర ప్రాంతాల వెంబడి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఉగ్రరూపాన్ని సంతరించుకుంటోంది. ఇప్పటికే భద్రాచలం వద్ద గోదావరి అత్యంత ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.

దీని ప్రభావం దిగువన ఉన్న ఏపీపై పడుతోంది. గోదావరి తీర ప్రాంతాలు వరదముంపునకు గురవుతున్నాయి. పోలవరం సహా పలు లంక గ్రామాలు వరద ముంపునకు గురవుతున్నాయి. వరద ఉధృతి నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఉత్తర కోస్తాలో వచ్చే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ అమరావతి వాతావరణ కేంద్రం ఇచ్చిన సమాచారంతో ఆయా జిల్లాల పాలన యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది.

Godavari floods 2022: AP govt on high alert Flood level is rising at Dowleswaram barrage

భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తోండటంతో మూడో ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. గోదావరి ఉపనదులు కడెంవాగు, కిన్నెరసాని, ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు క్యాచ్‌మెంట్ ఏరియాల్లో భారీ వర్షాల వల్ల అవి కూడా పోటెత్తుతున్నాయి. పోలవరం స్పిల్‌వే నుండి తొమ్మిది లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ముంపు గ్రామాల ప్రజలను రక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.

పోలవరం గేట్లను ఎత్తేయడం వల్ల వస్తున్న వరద నీటితో ధవళేశ్వరం బ్యారేజీ నిండుకుండలా మారింది. దీనితో అధికారులు 175 గేట్లు ఎత్తేశారు. వరదనీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు ఈ వరద ఉధృతి కొనసాగుతుందని అంచనా వేస్తోన్నారు. ఈ రాత్రికి ధవళేశ్వరం బ్యారేజీలోకి 10 లక్షల క్యూసెక్కుల మేర వరద ప్రవాహం వచ్చే అవకాశముందని భావిస్తోన్నారు. వచ్చిన వరద నీటిని వచ్చినట్టే దిగువకు వదిలేసేలా ఏర్పాట్లు చేశారు.

English summary
Godavari floods 2022: AP govt on high alert after Flood level in River Godavari is rising at Dowleswaram barrage with increasing inflows from the river catchment areas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X