రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాత్రంతా నిద్రలేని బాబు, బస్టాండ్‌లో భక్తుల కోసం: సునీత స్నానం(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి/కొవ్వూరు: గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలకు భక్తులు, జనం పోటెత్తుతున్నారు. శనివారం ఒక్కరోజే అరవై అయిదు లక్షల మందికి పైగా రాజమండ్రికి వచ్చి పుణ్య స్నానం ఆచరించారు. చిన్న స్నానఘట్టాల్లోనూ పెరిగిన రద్దీ బాగా కనిపించింది.

భక్తులు ఉప్పెనలా వచ్చి నదిలో స్నానాలు ఆచరించారు. గోదావరి పుష్కర స్నానాలకు శనివారం కనీవినీ ఎరుగని విధంగా తరలి వచ్చారు. రాజమండ్రి జన సంద్రంగా మారిపోయింది. వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. రాజమండ్రి పురవీధులు, స్నానఘట్టాలు ఇసుకవేస్తే రాలనట్టుగా ఉన్నాయి.

శుక్రవారం అర్ధరాత్రి నుంచి మొదలైన స్నానాలు శనివారం అర్ధరాత్రి దాటే వరకు క్షణం విరామం లేకుండా కొగనసాగుతూనే ఉన్నాయి. ఏ క్షణంలో చూసినా స్నానఘట్టాలు జనంతో కిటకిటలాడాయి. నగరంలోని పుష్కర రేవు నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న కోటిలింగాలకు కాలినడకన వెళ్లేందుకే గంటకు పైగా సమయం పట్టింది.

రాత్రంతా నిద్రలేని బాబు

రాత్రంతా నిద్రలేని బాబు

రాత్రంతా నిద్రలేని బాబు

పుష్కర స్నానంకు కొవ్వూరుకు వచ్చిన అచ్చెన్నాయుడు

పుష్కర స్నానంకు కొవ్వూరుకు వచ్చిన అచ్చెన్నాయుడు

రోజూ కంటే శనివారం 20 శాతం ఎక్కువగా వస్తారని ప్రభుత్వం భావించగా నూరు శాతం ఎక్కువ వచ్చారు. శనివారం సెలవు దినం కావడంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో మారుమూల ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో జనం వెల్లువలా ఇక్కడికి తరలి వచ్చారు.

పుష్కర స్నానంకు వచ్చి, సదుపాయాలు పరిశీలిస్తున్న మంత్రి

పుష్కర స్నానంకు వచ్చి, సదుపాయాలు పరిశీలిస్తున్న మంత్రి

అటు విజయవాడ, ఇటు విశాఖ మధ్య వాహనాలరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాజమండ్రిలోను ట్రాఫిక్‌కు అవరోధం ఏర్పడింది. రైల్వే స్టేషన్లు కిటకిటలాడాయి.

పుష్కర స్నానానికి వచ్చిన మంత్రి సునీత, కుటుంబ సభ్యులు.

పుష్కర స్నానానికి వచ్చిన మంత్రి సునీత, కుటుంబ సభ్యులు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదయం నుంచి పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారు. శనివారం లక్షల సంఖ్యలో జనం పుణ్యస్నానాలకు తరలి వచ్చినా చెదురు మదురు సంఘటనలు తప్ప అంతా సాఫీగా సాగిపోయింది. రద్దీ నియంత్రణలో పోలీసులు సఫలీకృతులయ్యారు.

మంత్రి పరిటాల సునీత

మంత్రి పరిటాల సునీత

ఏపి డీజీపీ జెవి రాముడు సాధారణ పోలీసులా కాలినడకన తిరిగి అన్ని రేవులలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

పవిత్ర స్నానం చేస్తున్న సునీత

పవిత్ర స్నానం చేస్తున్న సునీత

ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉభయగోదావరి జిల్లాల్లో పుష్కరాలు మొదలైన ఐదు రోజుల్లో పుణ్యస్నానాలు చేసినవారి సంఖ్య కోటిన్నర దాటింది.

పవిత్ర స్నానం చేస్తున్న సునీత

పవిత్ర స్నానం చేస్తున్న సునీత

శనివారం ఒక్కరోజే సాయంత్రం 6 గంటల వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో 65 లక్షల మంది స్నానాలు చేశారు. శనివారం అర్ధరాత్రి దాటే సరికి ఈ సంఖ్య 70 లక్షలకు చేరిందని అంచనా.

పవిత్ర స్నానం చేస్తున్న సునీత

పవిత్ర స్నానం చేస్తున్న సునీత

క్యూలైన్లతోపాటు రాజమండ్రిలోని రహదారుల పక్కన కూడా భక్తులకు కొన్ని లక్షల సంఖ్యలో మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు పంచారు. పలు డెయిరీల నుంచి భారీ సంఖ్యలో మజ్జిగ ప్యాకెట్లను రాజమండ్రికి తరలించారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

రాజమండ్రిలో ట్రాఫిక్‌జాంలో చిక్కుకున్న వాహనాల్లోని ప్రయాణికులకూ మంచినీళ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. నగరంలోని కోటిలింగాలు, పుష్కర, గౌతమి, సరస్వతి ఘాట్‌లలో పెద్ద ఎత్తున రద్దీ కనిపించింది.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

కోటిపల్లి, సోంపల్లి, జొన్నాడ, వాడపల్లి, అంతర్వేది వంటి క్షేత్రాలు, పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు, నరసాపురం వంటి చోట్ల స్నానఘట్టాలు భక్త జనకోటితో నిండిపోయాయి.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

స్నానఘట్టాల వద్ద ప్రభుత్వం భారీ సంఖ్యలో పోలీసుల్ని మోహరించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు శుక్రవారం అర్ధరాత్రి పుష్కరనగర్‌లు సందర్శించారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

శనివారం ఉదయం గంటన్నరపాటు 500 మంది అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం మంత్రులు, ముఖ్య అధికారులతో 2 గంటలపాటు సమీక్ష సమావేశం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులతో వచ్చే వాహనాలు ఒకేసారి రాజమండ్రికి చేరుకోకుండా వంతుల వారీగా పంపించాలని సూచించారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భక్తుల ఇబ్బందులు చూసి చలించిపోయారు. అర్ధరాత్రి రెండున్నర గంటల నుంచి ఐదు గంటల వరకు రాజమండ్రి బస్టాండులోనే గడిపారు. బస్సులను నియంత్రించే అధికారులకు ఆదేశాలు ఇస్తూ, యాత్రికులను దగ్గరుండి బస్సు ఎక్కిస్తూ గడిపారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... రాజమండ్రిలో యాత్రికుల రద్దీ కొనసాగుతుండటంతో తనకు నిద్రపట్టలేదని, వారిని సురక్షితంగా సొంత ప్రదేసాలకు పంపేందుకే తాను వచ్చానని చంద్రబాబు చెప్పారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

పుష్కర స్నానాలకు వస్తున్న యాత్రికులు క్షేమంగా తిరిగి తమ ఇళ్లకు చేరుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. పుష్కరాల ఏర్పాట్లు, నిర్వహణపై శనివారం పోలీసు కంట్రోల్‌ రూంలో సమీక్షించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రజలు క్రమశిక్షణతో పుష్కర స్నానం చేసి వెళ్తున్నారని ప్రశంసించారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

పుణ్యస్నానం కోసం ప్రయాస పడి వస్తున్నారన్నారని, తిరుమలలో వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వేచి ఉన్నట్టుగా పుష్కర స్నానానికి కూడా వేచి ఉంటున్నారని చంద్రబాబు తెలిపారు. పుష్కర స్నానాన్ని పవిత్ర కార్యక్రమంగా భావిస్తున్నారని, కొన్ని వేలమంది రహదారులు, ఫుట్‌పాత్‌లపై పడుకుని పుణ్యస్నానాలు చేస్తున్నారని వివరించారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు మానవ ప్రయత్నంగా ఎంత చేయగలమో అంతా చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. పుష్కర ఘాట్లను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచుతున్నామని తెలిపారు. తాగునీరు, భోజనం సాధ్యమైనంత మందికి అందేలా చూస్తున్నామన్నారు.

English summary
Godavari Pushkaralu 2015: Celebrating the Godavari
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X