రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పుష్కరాలు 3డే: భక్తుల సందడి, దొంగల చేతివాటం (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాల్లో భాగంగా మూడోరోజు కాస్తంత సందడిగి నెలకొంది. పుష్కరఘాట్లకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలాచరిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలోని పుష్కరఘాట్లు భక్తులతో జనసంద్రమయ్యాయి.

ఏ ఘాట్‌లో ఎంతమందో ఉన్నారో ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు

ఇక రాజమండ్రిలోని అన్ని ఘాట్లకు భక్తుల తాకిడి ఎక్కువ అవడంతో వీఐపీ ఘాట్లలోకి సామాన్య భక్తులను కూడా అనుమతిస్తున్నారు. రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో దిగిన భక్తులకు పుష్కరఘాట్లకు నేరుగా తరలివచ్చేందుకు గాను రవాణాశాఖ ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది.

పుష్కరాలను ఏర్పాట్లను ఏపీ డీజీపీ జేవీ రాముడు దగ్గరుండి పరిస్ధితి సమీక్షిస్తున్నారు. గురువారం పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు గోష్పాద క్షేత్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో పుష్కరాలకు మరింత రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

కాగా, పుష్కరాల్లో స్నానం చేసి తరించాలని భక్తులు ఓ వైపు ఆరాట పడుతుంటే, మరోవైపు దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. రాజమండ్రిలోని పుష్కరఘాట్ల వద్ద పూజారుల అవతారంలో కొందరు దొంగలు ప్రవేశించి భక్తులను మోసం చేస్తున్నారని తెలుస్తోంది.

భక్తుల బ్యాగులను సైతం అపహరించుకొని పోతున్నారు. దొంగల చేతివాటం గురించి ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోకపోగా, తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.

పుష్కరాల్లో భక్తుల సందడి

పుష్కరాల్లో భక్తుల సందడి

తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాల్లో భాగంగా మూడోరోజు కాస్తంత సందడిగి నెలకొంది. పుష్కరఘాట్లకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలాచరిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలోని పుష్కరఘాట్లు భక్తులతో జనసంద్రమయ్యాయి.

 పుష్కరాల్లో భక్తుల సందడి

పుష్కరాల్లో భక్తుల సందడి

ఇక రాజమండ్రిలోని అన్ని ఘాట్లకు భక్తుల తాకిడి ఎక్కువ అవడంతో వీఐపీ ఘాట్లలోకి సామాన్య భక్తులను కూడా అనుమతిస్తున్నారు. రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో దిగిన భక్తులకు పుష్కరఘాట్లకు నేరుగా తరలివచ్చేందుకు గాను రవాణాశాఖ ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది.

పుష్కరాల్లో భక్తుల సందడి

పుష్కరాల్లో భక్తుల సందడి

పుష్కరాలను ఏర్పాట్లను ఏపీ డీజీపీ జేవీ రాముడు దగ్గరుండి పరిస్ధితి సమీక్షిస్తున్నారు. గురువారం పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు గోష్పాద క్షేత్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో పుష్కరాలకు మరింత రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

పుష్కరాల్లో భక్తుల సందడి

పుష్కరాల్లో భక్తుల సందడి

గోదావరి పుష్కరాలలో భాగంగా మూడో రోజు గురువారంనాడు వివిధ పుష్కర ఘాట్లలో జనం రద్దీ బాగా పెరిగింది. మొదటి రోజున తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఆ విషాదాన్ని మర్చిపోయి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి చేరుకుంటున్నారు.

పుష్కరాల్లో భక్తుల సందడి

పుష్కరాల్లో భక్తుల సందడి

పుష్కరఘాట్ వద్ద ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండో రోజు బుధవారం భక్తుల సంఖ్య సగానికి తగ్గిన సంగతి తెలిసిందే. జిల్లాలోని 31 ఘాట్లలో లక్ష మంది భక్తులు స్నానమాచరించారు.

పుష్కరాల్లో భక్తుల సందడి

పుష్కరాల్లో భక్తుల సందడి

సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు అధిక ఆషాడమాస అమావాస్య రావడంతో గ్రహస్థితి ముహూర్తం బాగాలేదనే సెంటిమెంట్‌తో పుణ్యస్నానాలు చేసే వారి సంఖ్య తగ్గిందని ఆలయ అధికారులు తెలిపారు.

పుష్కరాల్లో భక్తుల సందడి

పుష్కరాల్లో భక్తుల సందడి

ఇదిలా ఉంటే గురువారం కూడా పుష్కరభక్తుల సంఖ్య సాధారణ స్థాయిలోనే ఉంటుందని, శుక్రవారం నుంచి పుష్కరాలకు భక్తుల తాకిడి పెరగనుందని అంచనా వేస్తున్నారు. శనివారం రంజాన్‌తో పాటు ఆదివారం సెలవు ఉండడంతో భక్తుల రద్దీ రెండు రోజులు మరింత పెరిగే అవకాశం ఉంది.

English summary
Godavari Pushkaralu Day 3: More people coming to ghats in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X