పుష్కరాల ముగింపు: అఖండ హారతికి బాబా రాందేవ్, వెయ్యి మందితో కూచిపూడి
రాజమండ్రి: గోదావరి మహా పుష్కరాలు శనివారం సాయంత్రంతో ముగియనున్నాయి. ముగింపు వేడులకు తెలుగు రాష్ట్రాలు భారీ ఏర్పాట్లు చేశాయి. ముఖ్యంగా ఏపీలో గోదావరి పుష్కరాల ముగింపు వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు తీర్మానించారు.
ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాలలో సాయంత్రం ఆరు గంటలకు గోదావరి పుష్కరాల ముగింపు వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలో వెయ్యిమంది కూచిపూడి కళాకారులతో నిర్వహించనున్న నృత్యరూపకం భక్తులను అలరించనుంది.
ఇక పుష్కరాల ముగింపు సందర్భంగా రాజమండ్రిలో గోదావరికి అఖండ హారతి కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పుష్కరాల ముగింపు వేడుకలకు రావాలన్న సీఎం చంద్రబాబు ఆహ్వానాన్ని మన్నించిన యోగా గురువు రాందేవ్ బాబా రాజమండ్రికి రానున్నారు.

అఖండ హారతికి బాబా రాందేవ్, వెయ్యి మందితో కూచిపూడి
అంతేకాక ప్రముఖ సంగీత విద్యాంసుడు మంగళంపల్లి బాలబురళీకృష్ణచే కర్ణాటక గాత్ర సంగీతం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక పుష్కరాల ముగింపు ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రమంతా ప్రతి ఇంటిలో దీపాలు వెలిగించాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.

పుష్కరాల ముగింపు: అఖండ హారతికి బాబా రాందేవ్, వెయ్యి మందితో కూచిపూడి
అఖండ హారతికి బాబా రాందేవ్, వెయ్యి మందితో కూచిపూడి
శనివారం గోదావరి పుష్కరాల్లో చివరి రోజు కావడంతో పుష్కరఘాట్లకు భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కర ఘాట్లలో భక్తులు కిటకిటలాడుతున్నారు. రాజమండ్రి, నర్సాపురం, కొవ్వూరు పుష్కరఘాట్లు భక్తులతో కోలాహలంగా మారాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతంలోని కేదార్‌ఘాట్, కోడేరు ఘాట్లలో భక్తుల రద్దీ పెరిగింది.

అఖండ హారతికి బాబా రాందేవ్, వెయ్యి మందితో కూచిపూడి
ఈనెల 14న ఉదయం 6.26గంటలకు పుష్కరాలు మొదలైన కొద్దిసేపటికే రాజమండ్రి నగరంలోని పుష్కరఘాట్‌లో తొక్కిసలాట జరిగి 27మంది మృతి చెందిన సంఘటన మినహా మిగిలిన 10రోజులూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.

అఖండ హారతికి బాబా రాందేవ్, వెయ్యి మందితో కూచిపూడి
గోదావరి పుష్కరాలు ప్రారంభమైన తరువాత శుక్రవారం సాయంత్రం వరకు ఉభయగోదావరి జిల్లాల్లో పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య 4కోట్ల 34లక్షలుగా అధికారికంగా ప్రకటించారు. అధికారిక లెక్కల ప్రకారం శనివారం సాయంత్రానికి ఇది ఐదు కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు.

అఖండ హారతికి బాబా రాందేవ్, వెయ్యి మందితో కూచిపూడి
శుక్రవారం సాయంత్రం 6గంటల వరకు ఉభయగోదావరి జిల్లాలో 40లక్షల 86వేల మంది పుణ్యస్నానాలు చేసినట్టు అధికారులు ప్రకటించారు. రాజమండ్రిలోనే 14లక్షల మంది పుణ్యస్నానాలు చేశారని, తూర్పుగోదావరి జిల్లాలో 29లక్షలు, పశ్చిమగోదావరి జిల్లాలో 12లక్షల మంది పుణ్యస్నానాలు చేసినట్టు అధికారికంగా ప్రకటించారు.
అఖండ హారతికి బాబా రాందేవ్, వెయ్యి మందితో కూచిపూడి
గోదావరి పుష్కరాలు ప్రారంభోత్సవం రోజున పుష్కరఘాట్‌లో తొక్కిసలాట జరిగి 27మంది మృతి చెందటంతో, అప్పటి నుండి రాజమండ్రిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు మకాం చేశారు. పుష్కరాల ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు.

అఖండ హారతికి బాబా రాందేవ్, వెయ్యి మందితో కూచిపూడి
పోలీస్ అతిథిగృహంలోని పోలీస్ కంట్రోల్ రూంలో కూర్చుని సిసి కెమెరాల్లో చూస్తూ పరిస్థితిని సమీక్షిస్తూ, అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రతి రోజు రాత్రి పుష్కరాల విధులు నిర్వహిస్తున్న అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు.

అఖండ హారతికి బాబా రాందేవ్, వెయ్యి మందితో కూచిపూడి
గోదావరి హారతి ఉత్సవం అనంతరం దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పుష్కరాలు ముగింపు రోజున గోదావరి హారతి ఉత్సవాన్ని మరింత ఆర్భాటంగా నిర్వహించేందుకు సినీ దర్శకుడు బోయపాటి శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అఖండ హారతికి బాబా రాందేవ్, వెయ్యి మందితో కూచిపూడి
గోదావరి హారతి అనంతరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరగనున్న ముగింపు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం వెయ్యి మందితో కూచిపూడి నృత్య ప్రదర్శన, మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీత కచేరి తదితర సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.












Click it and Unblock the Notifications