తిరుమలలో బంగారు డాలర్లు కావాలనుకొనే భక్తులకు బిగ్ అప్డేట్..!!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నెల 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం ఇప్పటికే రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా టోకెన్ల జారీ.. దర్శనం పైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాగా.. ఇప్పుడు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న కౌంటర్లలో బంగారు డాలర్ల కొరత ఇప్పుడు భక్తులకు నిరాశ కలుగుతోంది. దీంతో, వెంటనే డాలర్లను అందుబాటులోకి తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు.

తిరుమలలో భక్తుల దర్శనం.. వసతి.. సేవల విషయంలో టీటీడీ కొత్త నిర్ణయాలు అమలు చేస్తోంది. డిసెంబర్ 30,31 తేదీల్లో వైకంఠ ఏకాదశి.. ద్వాదశి ఆ మరుసటి రోజున జనవరి 1 కారణంగా భక్తుల రద్దీ పెరుగుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా ఈ సారి వైకుంఠ ఏకాదశి టోకెన్ల రిజిస్ట్రేషన్ కు భారీ స్పందన వస్తోంది. పది రోజుల దర్శనాలకు సంబంధించి ఇప్పటికే టీటీడీ స్పష్టత ఇచ్చింది. కాగా, తాజాగా తిరుమలలో బంగారు డాలర్ల కొరత భక్తులకు నిరాశ కలిగిస్తోంది.

gold-dollars-shortage-in-tirumala-leads-to-devotees-disappointment-details-here

గత 16 రోజులుగా 2, 5, 10 గ్రాముల డాలర్లు అందుబాటు లో లేవు. జ్ఞాపకంగా కొనుగోలు చేసే భక్తులు నిరాశ చెందుతున్నారు.తిరుమల శ్రీవారిని దర్శించుకు న్న తర్వాత భక్తులు జ్ఞాపకంగా ఈ బంగారు డాలర్లను కొనుగోలు చేస్తుంటారు.. బంగారంంతో పాటుగా వెండి, రాగి డాలర్లు ఉంటాయి. అయితే 2, 5, 10 గ్రాముల బంగారు డాలర్లు ఆ కౌంటర్‌లో దొరకడం లేదు.

దీంతో, శ్రీవారి దర్శనం తర్వాత భక్తులు తమ జ్ఞాపకంగా కొనుగోలు చేసే డాలర్లు దొరక్కపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఈ డాలర్లపై శ్రీవారు, అమ్మవారి ఫొటోలు ఉండటంతో భక్తులు వాటిని సేకరించి పెట్టుకుంటారు. టీటీడీ విక్రయిస్తున్న ఈ డాలర్లను కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అధికారులు వెంటనే స్పందించి, డాలర్లను విక్రయ కేంద్రంలో అందుబాటులో ఉంచాలని వారు కోరుతున్నారు.

కొంత కాలంగా టీటీడీ భక్తుల కోసం బంగారు, వెండి, రాగి డాలర్లను విక్రయిస్తోంది. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉండే స్వామి, అమ్మవార్ల రూపాలతో కూడిన ఈ డాలర్లను కొనుగోలు చేస్తే శుభం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. సాధారణంగా ప్రతి నెలా ఈ డాలర్ల అమ్మకాలు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు జరుగుతుంటాయి. కొద్ది రోజులుగా డాలర్లకు కొరత ఏర్పడింది. ఎప్పుడు అందుబాటులో ఉండేలా టీటీడీ ముందస్తు ఏర్పాట్లు చేస్తుంది. అయితే, దాదాపు 16 రోజులుగా డాలర్లు అందుబాలులో లేకపోవటంతో.. వెంటనే టీటీడీ చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+