వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెజవాడ దుర్గమ్మ హుండీల లెక్కింపులో సిబ్బంది చేతివాటం; ఎస్పీఎఫ్ తనిఖీల్లో బయటపడిన బంగారం

|
Google Oneindia TeluguNews

ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మ వారికే టోకరా వేసేందుకు కొందరు ఆలయ సిబ్బంది ప్రయత్నించారు. దుర్గమ్మ హుండీల లెక్కింపులో సిబ్బంది చేతివాటం చూపించారు. ఎస్ పి ఎఫ్ పోలీసుల ఆకస్మిక తనిఖీలలో సిబ్బంది చేతివాటం వెలుగులోకి వచ్చింది.

దుర్గమ్మ హుండీల లెక్కింపు... సిబ్బంది చేతివాటం

దుర్గమ్మ హుండీల లెక్కింపు... సిబ్బంది చేతివాటం

అసలేం జరిగిందంటే సోమవారం నాడు మహామండపం ఆరో అంతస్థులో అమ్మ వారి హుండీల్లోని కానుకల లెక్కింపు కార్యక్రమం జరిగింది. హుండీల లెక్కింపు సమయంలో బంగారు ఆభరణాలను మాయం చెయ్యటం కోసం సిబ్బంది ప్రయత్నం చేశారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఎస్పీఎఫ్ సిబ్బంది పురుషులు ఉపయోగించే బాత్రూమ్ ల వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా, అక్కడ రెండు చిన్న కవర్లలో బంగారం బయట పడింది. హుండీలను లెక్కించే సిబ్బంది బంగారాన్ని మాయం చేసి కవర్లలో బాత్ రూమ్ ల వద్ద పెట్టారు.

 బాత్ రూమ్ ల వద్ద కవర్లలో బంగారం .. గట్టి నిఘా ఉన్నా చోరీ

బాత్ రూమ్ ల వద్ద కవర్లలో బంగారం .. గట్టి నిఘా ఉన్నా చోరీ


ఎస్.పి.ఎఫ్ తనిఖీల్లో బాత్ రూమ్ ల వద్ద దొరికిన కవర్లలో నల్లపూసల చైన్,ఒక ఉంగరం,రెండు గిల్టుఉంగరాలు,బుట్ట దుద్దులు బయటపడ్డాయి. సుమారు 5గ్రాముల బంగారం గా తేల్చిన అధికారులు, వీటి విలువ 16 వేల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇక వీటిని వారు ఈవో భ్రమరాంబ కు అప్పగించారు. సీసీ కెమెరాల నిఘా మధ్య, ఎస్ పి ఎఫ్ సిబ్బంది పహారా నడుమ హుండీ లెక్కింపు చేస్తున్న ప్రాంతంలో గట్టి నిఘా ఉంటుంది. ఇక అమ్మవారి హుండీ ఆదాయాన్ని లెక్కించడానికి వచ్చే వారిని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోనికి అనుమతిస్తారు. లెక్కింపు పూర్తి చేసుకుని బయటకు వెళుతున్న క్రమంలోనూ వారిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారు.

అంతర్గత విచారణ.. సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా ఇంటి దొంగలు ఎవరో గుర్తించే పనిలో అధికారులు

అంతర్గత విచారణ.. సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా ఇంటి దొంగలు ఎవరో గుర్తించే పనిలో అధికారులు

ఇంత గట్టి బందోబస్తు ఉన్నప్పటికీ అమ్మవారి కానుకలను కాజేయడానికి సిబ్బంది ప్రయత్నం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక దీనిపై ప్రస్తుతం అంతర్గతంగా విచారణ జరుగుతుంది. సీసీ కెమెరాలను పరిశీలించి ఇంటి దొంగలు ఎవరో నిగ్గు తేల్చే పనిలో ఉన్నారు అధికారులు. గతంలో దుర్గగుడిలో అమ్మవారి రథంలో వెండి సింహాలు మాయం అయిన ఘటనపై రచ్చ కొనసాగిన నేపధ్యంలో తాజాగా సిబ్బంది చేతివాటం బయటకు రాకుండా గోప్యంగా ఉంచి విచారణ జరుపుతున్నారు.

41 హుండీలలో 19 రోజుల్లో వచ్చిన కానుకలు 2.64 కోట్లు

41 హుండీలలో 19 రోజుల్లో వచ్చిన కానుకలు 2.64 కోట్లు

ఇక పోలీసులకు కూడా ఫిర్యాదు చెయ్యకుండా విచారణ చేపట్టినట్టు సమాచారం. ఇప్పటివరకు కనకదుర్గ అమ్మవారి హుండీ లెక్కింపు కార్యక్రమం లో 41 హుండీలలో 19 రోజుల్లో వచ్చిన కానుకలు 2.64 కోట్లుగా ఉంది. ఇక 586 గ్రాముల బంగారం , 6.060 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించుకున్నారు.


English summary
Vijayawada kanaka Durga temple staff theft the gifts of durga maa in the calculation of hundis. Gold was found in the covers at the bathroom during SPF inspections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X