పిడుగురాళ్ల లో అప్పుల బాధతో సైనేడు మింగి గోల్డ్ వర్కర్ మృతి
గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలో బంగారు పని చేసే పఠాన్ బాబు (38) అనే వ్యక్తి సైనేడు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు.
గుంటూరు: గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలో బంగారు పని చేసే పఠాన్ బాబు (38) అనే వ్యక్తి సైనేడు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాలు ప్రకారం పిల్లలగడ్డ లో నివాసం ఉంటున్న పఠాన్ బాబు మాయాబజార్ లోని ఒక బంగారం దుకాణం లో గోల్డ్ వర్కర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
మరో వృత్తి తెలియని పఠాన్ బాబు కొన్ని రోజులుగా మనో వేదన తో పనికి వస్తున్నాడు.ఈ క్రమంలో అతనికి ఆర్ధిక ఇబ్బందులు తోడవడంతో తాను పని చేసే షాపులో ఎవరూ లేని సమయం చూసుకుని సైనేడ్ మింగిఆత్మహత్య చేసుకున్నాడు. షాపు కు వచ్చిన కష్టమర్లు పఠాన్ బాబు పరిస్థితి గమనించారు.

అప్పటికే పఠాన్ బాబు ఒంటి పై నల్లని బొబ్బలు వచ్చి అపస్మారక స్థితి లోకి వెళ్ళాడు. దీనితో ప్రక్క షాపు యాజమానులకు విషయం తెలియజేయడం తో బాబు అందరూ చూస్తుండగానే ప్రాణాలు వదిలాడు. జరిగిన ఘటన పై షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పఠాన్ బాబు అప్పులు భాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని పోలిసుల ప్రాధమిక విచారణ లో తేలింది.మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పిడుగురాళ్ల ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.












Click it and Unblock the Notifications