స్వాతంత్ర్య సమరయోధుడిగా: టీవీ సీరియల్‌లో నటిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఒకరు టీవీ సీరియల్‌లో నటిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అది కూడా భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సీరియల్ కావడం గమనార్హం.

రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయంతో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జీవితచరిత్ర 100 ఎపిసోడ్స్‌గా సీరియల్‌ నిర్మాణం జరుగుతోంది. ఈ సీరియల్‌లో రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు.. లాలాలజపతిరాయ్‌ పాత్రలో నటిస్తున్నట్టు తెలిపారు.

gollapalli surya rao plays a role in a serial

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, ముఖ్య ఘట్టాలు ఈ సీరియల్‌లో ఉంటాయని వివరించారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో అంబేద్కర్‌, లాలా లజపతిరాయ్‌ మధ్య జరిగే డిబేట్‌లో గొల్లపల్లి నటిస్తున్నట్టు తెలిపారు.

తెనాలిలో సోమవారం ఈ సీరియల్‌ నిర్మాణం ప్రారంభమైనట్టు సూర్యారావు తెలియజేశారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లోనూ రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో సూర్యారావు కూడా చేరినట్లయింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugudesam MLA Gollapalli Surya Rao playing a role in a serial, which is making on BR Ambedkar biography.
Please Wait while comments are loading...