అయ్యప్ప భక్తులకు శుభవార్త: శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు!!
అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునే భక్తులకు ఈజీగా దర్శనం కావడం కోసం ట్రావెన్కోర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుని శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో అయ్యప్ప స్వామి భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే కూడా శుభవార్తను చెప్పింది. శబరిమలకి వెళ్లే అయ్యప్ప స్వామిని దర్శించుకునే భక్తుల కోసం 22 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
శబరిమల క్షేత్రాన్ని దర్శించుకొనేందుకు వెళ్లే భక్తజనం కోసం 22 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ కొల్లం, నర్సాపుర్-కొట్టాయం, కాచిగూడ-కొల్లం, కాకినాడ టౌన్-కొట్టాయం, కొల్లం-సికింద్రాబాద్ మధ్య నిర్దేశించిన రోజుల్లో రాకపోకలు కొనసాగించనున్నాయి. ఈ రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, సెకెండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని అధికారులు వెల్లడించారు.

శబరిమల యాత్రకు ఇప్పటికే భక్తులు బారులు తీరుతున్న సమయంలో వారి అవసరానికి తగ్గట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ళు కూడా ఏర్పాటు చేసింది. దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయంతో అయ్యప్ప భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రంలో వార్షిక వేడుకలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
మండల మకర విళక్కు పండగ సీజన్ కావడంతో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అయ్యప్ప స్వామిని భక్తులు దర్శిచుకోవటానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశారు. శబరిమల అయ్యప్ప స్వామికి దేశ వ్యాప్తంగానే కాదు విదేశాలలోనూ భక్తులు ఉన్నారు. ఒక్క కేరళ రాష్ట్రంలోనే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా భక్తులు, మాలధారులు వస్తూ ఉంటారు.
అయ్యప్ప స్వామివారిని దర్శించుకోవడానికి అయ్యప్ప సన్నిధానం, పంబ వద్దకు ఇప్పటికే భారీగా భక్తులు వస్తున్నారు. ఈ క్రమంలో అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేసి గుడ్ న్యూస్ చెప్పింది.












Click it and Unblock the Notifications