Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మామిడి రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్... రూ.260 కోట్లు రిలీజ్ !

మామిడి రైతులకు ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారు. కొద్దిరోజుల క్రితం కుప్పంలో పర్యటించిన ముఖ్యమంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే మామిడి రైతుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఈరోజు (జూలై 18, 2025) వారి సమస్య పరిష్కారానికి రూ.260 కోట్ల నిధులను విడుదల చేశారు.

అలానే రూ.4 సబ్సిడీతో 6.5 లక్షల టన్నుల తోతాపురి మామిడి కాయలు కొనుగోలు చేసేందుకు కేటాయించాలని ఆదేశించారు. దీంతో మార్కెట్ సమస్యలతో బాధపడుతున్న చిత్తూరు జిల్లా మామిడి రైతులకు లబ్ధిచేకూరనుంది. కాగా సబ్సిడీ మొత్తాన్ని రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నట్లు అధికారులు సూచిస్తున్నారు. రైతులు తమ అకౌంట్లను పరిశీలించుకోవాలని చెప్పారు.

good-news-for-mango-farmers-by-cm-chandrababu-naidu

అయితే రూ. 260 కోట్లు MIS విధానంపై పూర్తి సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని వ్యవశాయ శాఖ తెలిపింది. తోతాపురి మామిడి కాయల కొనుగోళ్లు ఆగస్టు 2025 వరకు కొనసాగించాలని, ప్రాసెసర్లు రూ.8, రూ.12 మద్దతు ధర ఇవ్వాలని కోరింది.

మరోవైపు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో సిట్‌ విచారణ తుది దశకు చేరిందని ఆయన చంద్రబాబు అన్నారు. అన్ని ఆధారాలతో గత పాలకులు అడ్డంగా దొరికారని.. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారని మండిపడ్డారు. దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. జగన్‌.. తాను చేసిన తప్పుల్ని కూడా మనమీదకు నెట్టేసే రకం అంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రగతిని దేశస్థాయిలో వివరించాల్సిన బాధ్యత ఎంపీలదే'' అని చంద్రబాబు అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+